Ravi Teja Father Passes Away: హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం
Ravi Teja Father Passes Away రవితేజ తండ్రి గోపాలరాజు మరణించాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతునన ఆయన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.

Ravi Teja Father Passes Away: హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రవితేజ తండ్రి గోపాలరాజు మరణించాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. ఆయన భార్య పేరు రాజ్యలక్ష్మి. ఈ దంపతులకు రవితేజ, రఘు, భరత్ అనే కుమారులున్నారు. రాజగోపాల్ రాజు ఫార్మాసిస్ట్ కావడంతో ఉత్తర భారతంలో చాలాకాలం నివాసమున్నారు.
జైపూర్, ఢిల్లీ, ముంబై, బోపాల్ వంటి ప్రాంతాల్లో చాలా కాలం ఉండి ఆ తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. రవితేజ అక్కడే సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. అయితే టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం కోట శ్రీనివాసరావు మరణించగా, సోమవారం హీరోయిన్ బి. సరోజా దేవి కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి తేరుకునేలోపే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. రాజగోపాల్ మరణం పై చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.