Ravi Teja Daughter: త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు మోక్షద.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
Ravi Teja Daughter హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో రవితేజ. తాజాగా హీరో రవితేజ కూతురు మోక్షదా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట అందరిని ఆకట్టుకుంటున్నాయి.

Ravi Teja Daughter: తెలుగు సినిమా ప్రేక్షకులకు మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో రవితేజ. తాజాగా హీరో రవితేజ కూతురు మోక్షదా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట అందరిని ఆకట్టుకుంటున్నాయి. మొదట్లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు రవితేజ సైడ్ రోల్స్ లో కూడా కనిపించారు. ఆ తర్వాత అయినా హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా హిట్స్ అందుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా తక్కువ సమయంలోనే స్టార్డం సొంతం చేసుకున్నారు. వయసు పెరుగుతున్నా కూడా ఏమాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ప్రస్తుతం ఉన్న కుర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు రవితేజ. విభినమైన కథలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను నిత్యం అలరిస్తున్నారు. ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రవితేజ తన తర్వాతి సినిమాలో బిజీగా ఉన్నారు. తాజాగా సామాజిక మాధ్యమాలలో రవితేజ ఫ్యామిలీ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మాస్ మహారాజు రవితేజ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ మరియు బ్యాంకాక్ వెకేషన్కు వెళ్లారు. ఈ వెకేషన్కు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో రవితేజ భార్యతో పాటు కొడుకు, కూతురు అలాగే మరి కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఎలా రవితేజ కూతురు మోక్షద భూపతి రాజు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బయట అంతగా కనిపించని రవితేజ కూతురు మోక్షద ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అయితే త్వరలోనే మోక్షదా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మోక్షదా హీరోయిన్ గా కాకుండా నిర్మాతల సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
తన తండ్రి రవితేజ బ్యానర్ ఆర్టి టీం వర్క్ కాకుండా తాను కొత్తగా మరో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించాలని అనుకుంటుందట. ప్రస్తుతం రవితేజ కూతురు మోక్షద సితార సంస్థలో ప్రొడక్షన్ మెలకువలు నేర్చుకుంటుందని సమాచారం. అలాగే రవితేజ తనయుడు మహాధర్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో రవితేజ కూతురు మోక్షదా ఫోటోలను చూసి అందరూ హీరోయిన్లకు మించిన అందంతో చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.