Gaddar Awards: గద్దర్ సినీ అవార్డులకు అప్లై చేసుకోవడం ఎలా?

Gaddar Awards:
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనుంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో ప్రతీ ఏటా ఈ పురస్కారాలను ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఈ అవార్డులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ఈ అవార్డును ప్రతీ ఏడాది ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గద్దర్ అవార్డులను పలు విభాగాల్లో అందించనున్నారు. ఈ ఏడాది ఉత్తమ చిత్రాలు, నటీనటుల వ్యక్తిగత అవార్డులు, సాంకేతిక నిపుణులకు అందించనున్నారు.
అలాగే బాలల చిత్రం, జాతీయ సమైక్యత చిత్రం, పర్యావరణ చిత్రం, చారిత్రక సంపద చిత్రాలు వంటి విభాగాలలో కూడా ఈ ఏడాది గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. మళ్లీ యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు మొదటిసారి నటించిన ఫీచర్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్ విభాగాలలో కూడా పురస్కారాలు ఇస్తారు. వీటితో పాటు తెలుగు సినిమాపై పరిశోధన జరిపే ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా గద్దర్ అవార్డును అందజేయాలని భావిస్తున్నారు. అయితే ఈ అవార్డులు ఇవ్వడానికి ముఖ్య కారణం తెలుగు సినిమాలను పురస్కరించడంతో పాటు మానవీయ విలువలను, సమాజానికి దోహదం చేసే సినిమాలను ప్రోత్సహించడాని కోసం ఇస్తున్నారు.
గత ప్రభుత్వ అవార్డులను ఇవ్వలేదు. 2013 నుంచి 2023 వరకు ఇవ్వని వాటికి కూడా తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ఇవ్వనుంది. గతేడాది బెస్ట్ కాకుండా ఒక్కో ఏడాదికి అన్నింట్లో బెస్ట్ కేటగిరీల్లో ఇవ్వనుంది. అయితే గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబందించిన దరఖాస్తులను ఏ.సి గార్డ్స్‌లోని తెలంగాణ చలన చిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలి. మార్చి 13వ తేదీ నుంచి వీటిని తీసుకుంటారు. ఈ గద్దరు అవార్డులను ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై చలన చిత్రం, బాలల చలన చిత్రం, పర్యావరణం, హెరిటేజ్, చరిత్రలపై చలన చిత్రం, డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిలిం, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, తెలుగు సినిమాలపై బుక్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు కూడా కేటగిరీలలో ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరి ఈ ఏడాది ఎవరెవరికి ఏయే కేటగిరీల్లో గద్దర్ అవార్డులు వస్తాయో చూడాలి.