Pawan Kalyan : కావాలనే పవన్ కళ్యావణ్ ను టార్గెట్ చేస్తున్నారా..

Pawan Kalyan :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో పాటు మరోవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. దర్శక నిర్మాతలు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది అని ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి. కానీ అదే రోజున కొన్ని సినిమాలు పోటీ పడుతుండడంతో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పై అభిమానులలో సందేహాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా సరే మార్చి 28న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.కానీ అభిమానులు మాత్రం ఈ విషయం నమ్మడం లేదు. పవన్ కళ్యాణ్ కూడా మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా మూవీ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. అయితే మార్చ్ 28 కి ఇంకా ఎన్నో రోజులు లేవు. మరోవైపు ఈ సినిమాకు పవన్ డేట్స్ కూడా కావాల్సి ఉంది. మరోవైపు సినిమా యూనిట్ ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ డేట్స్ సంపాదించి అనుకున్న సమయానికి సినిమా విడుదల చేస్తామన్నారు. ఏఏం రత్నం ఈ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. హీరో నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా కూడా మార్చి 28న రిలీజ్ కానుందని వార్తలు వినిపించాయి.హీరో నితిన్ సినిమాతో సహా మరి రెండు సినిమాలు పోటీలో ఉన్నాయి.
అయితే హీరో పవన్ కళ్యాణ్ కు పోటీగా తెలిసి తెలిసి నితిన్ అయితే రారు, పైగా మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ తో పోటీ పడే సాహసం నితిన్ అయితే చేయరు. ఈ విధంగా చూసుకుంటే హరిహర వీరమల్లు రిలీజ్ అయితే కనుక రాబిన్ హుడ్ రాడు. ఈ క్రమంలోనే మార్చి 28న మా సినిమా పక్కా అంటున్నారంటే హరిహర వీరమల్లు వస్తుందా రాదా అని కన్ఫ్యూజన్ మళ్ళీ అభిమానులలో మొదలైంది. అలాగే మార్చి 27న లూసీ ఫర్ 2, వీర ధీర సూరం సినిమాలు ఇప్పటికే షెడ్యూల్ అయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న మాడ్ స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ కానుంది.
అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వస్తే నా సినిమా ఎలా రిలీజ్ చేస్తానని నిర్మాత నాగ వంశీ గతంలోనే చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందా ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయితే తన సినిమాను వాయిదా వేసుకోవచ్చు లే అని అందరూ అనుకుంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా హరిహర వీరమల్లు సినిమాపై చాలా సినిమాలు ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది. అయితే అనుకున్న సమయానికి హరిహరా వీరమల్లు సినిమా