Soundarya: పదేళ్ల తర్వాత దూరమవుతావు ముందుగానే సౌందర్యను హెచ్చరించిన ప్రొడ్యూసర్ చిట్టిబాబు..
Soundarya టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బెంగళూరు బ్యూటీలకు అస్సలు కొదవలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలిన బెంగళూరు హీరోయిన్లలో దివంగత నటి సౌందర్యది చాలా ప్రత్యేక స్థానం అని చెప్పడంలో సందేహం లేదు.

Soundarya: అచ్చం తెలుగింటి ఆడపడుచు లాగా కనిపించే హీరోయిన్ సౌందర్య తెలుగు అమ్మాయి కాదంటే ఎవరు నమ్మలేరు. తనకట్టు బొట్టుతో పాటు తనదైన నటనతో దివంగత నటి సౌందర్య టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేశారు. ఈమె అకాల మరణం సినీ అభిమానులను కలచివేసింది. అయితే ఆమె మరణం ఆమె తండ్రికి ముందే తెలుసు అని అంటున్నారు. పదేళ్లపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డం చూసిన హీరోయిన్ సౌందర్య ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. అయితే సౌందర్య తండ్రి ఆమె భవిష్యత్తును ముందే ఊహించారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రొడ్యూసర్ చిట్టి బాబుతో పంచుకున్నారట. చిట్టి బాబు నువ్వు ఇండస్ట్రీకి దూరం కాబోతున్నావు అంటూ సౌందర్యకు చెప్పారట. ఆ మాటలకు హీరోయిన్ సౌందర్య కూడా షాక్ అయ్యారని కానీ ఇంత పెను ప్రమాదాన్ని ఆమె కూడా ఊహించి ఉండరు అని తెలిపారు. సౌందర్య తండ్రి సత్యనారాయణకు తన కూతురు సౌందర్య అంటే ఎంతో అపారమైన ప్రేమ. అయితే ఆమె మరణం గురించి ఆమె తండ్రి సత్యనారాయణకు ముందే తెలుసు అని ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తెలిపారు. సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఆమె జాతకాన్ని జ్యోతిష్యాల దగ్గర చూపించారు. అయితే ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అప్రతిహత నాయకగా ఎదుగుతుందని అలాగే జాతీయస్థాయిలో కూడా గుర్తింపు పొందుతుందని ఆయన తెలుసుకున్నారు.
అయితే ఆమె ఆ రంగంలో కేవలం పదేళ్లు మాత్రమే ఉంటుందని ఆ తర్వాత సౌందర్య పెన్ను ప్రమాదానికి కూడా ఎదురవుతుందని ముందుగానే జ్యోతిష్యులు హెచ్చరించారు. ఈ విషయాలను సౌందర్య తండ్రి సత్యనారాయణ చిట్టి బాబుతో పంచుతున్నారట. అయితే ఆ పెను ప్రమాదం గురించి సౌందర్యకు సూటిగా చెప్పకుండా పదేళ్ల తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతుందని మాత్రం పరోక్షంగా తెలిపారు. ఆ సమయంలో ఆమెకు పెళ్లి జరగడంతో ఆమె కుటుంబ జీవితంలో స్థిరపడుతుందని చిట్టిబాబు భావించారు. కానీ సౌందర్య మరణం తర్వాత సత్యనారాయణ మాటల్లోని నిజమైన అర్థం చిట్టి బాబుకి అర్థమయింది. చిట్టిబాబు సౌందర్య పెళ్ళి తర్వాత ఆమెను కలిసినప్పుడు నీ తండ్రి చెప్పిన విషయాలన్నీ నీ జీవితంలో నిజమవుతున్నాయి.
ఆయన జాతీయస్థాయిలో నీకు గుర్తింపు వస్తుందన్నారు. నువ్వు అమితాబ్ బచ్చ, చిరంజీవి, రజనీకాంత్, మోహన్లాల్ వంటి స్టార్ హీరోలతో అన్ని భాషలలోనూ నటించావు. ఇక మిగిలింది ఒక్కటే సినిమా ఇండస్ట్రీకి దూరంగా అంటే కుటుంబంతో జీవితం గడపడం అని ఆయన అన్నారు. ఆ మాటలకు స్పందించిన సౌందర్య అంత మాట అన్నారేంటీ సార్.. నాన్న చెప్పినవన్నీ నిజమయ్యాయి. కానీ ఇది ఒకటి తప్పని నిరూపిస్తాను. చివరి వరకు సినిమాల్లోనే కొనసాగుతాను అని సౌందర్య చెప్పారట. అయితే సౌందర్య తాను చెప్పినట్లుగానే 1993లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 100 సినిమాలలో నటించి నటిగా ఉన్న సమయంలోనే మరణించారు.
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్
-
Fish Venkat Daughter: రామ్ చరణ్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్
-
Kaushal: బిగ్ బాస్ తర్వాత నా జీవితం కోలాప్స్ : కౌషల్ షాకింగ్ కామెంట్స్