Shoaib Malik: తండ్రి కాబోతున్న షోయబ్ మాలిక్.. మూడో భార్య ప్రెగ్నెంట్

Shoaib Malik:
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గతేడాది నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతనికి జావేద్ మూడో భార్య. భారత టెన్నిస్ క్రీడాకారణి సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న తర్వాత నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సనా జావేద్ గర్భవతి అని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. రంజాన్ సందర్భంగా సనా జావేద్ ఇటీవల ప్రముఖ పాకిస్తానీ నటుడు ఫహద్ ముస్తఫా రంజాన్ స్పెషల్ షో జీలో పాల్గొంది. ఇద్దరు పోటీదారులు ఏదో తింటుంటే.. సనా వారిని చూసి వాంతులు చేసుకుంటుంది. దీంతో సనా తల్లి కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై షోయబ్ మాలిక్, సనా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. వీరి పెళ్లి అయ్యి ఏడాది కూడా పూర్తి కావస్తుంది. సనా గర్భవతి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సనా పాకిస్థాన్‌లో అగ్ర నటి. చాలా మంది అగ్రనటులతో నటించింది. ఎన్నో హిట్ సినిమాల్లోనూ కనిపించింది. మంచి ఫాలోయింగ్ కూడా సనాకి ఉంది. అయితే ఈ విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.
షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను 2010లో వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో చాలా మంది వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. సానియా సోయబ్‌ను రెండో వివాహం చేసుకుంది. దీనికి తోడు పాకిస్థాన్ కావడంతో చాలా మంది వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. అప్పట్లో వీరి వివాహం ఒక సెన్సేషన్. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే షోయబ్ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల సానియా విడాకులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వారి వ్యక్తిగత కారణాలు ఏంటో సరిగ్గా తెలియదు. సానియాతో విడాకులు తర్వాత షోయబ్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌కు కూడా ఇది రెండో పెళ్లి. ఈమె ఉమర్ జైస్వాల్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. అయితే సానియాతో ఉన్నప్పుడే షోయబ్ మాలిక్ సనా జావేద్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇలా షోయబ్ మాలిక్ మూడు పెళ్లి్ళ్లు చేసుకున్నాడు. దీంతో షోయబ్‌పై వ్యతిరేకత పెరిగింది. కేవలం ఇండియానే కాకుండా పాకిస్తాన్ కూడా అతని మూడో పెళ్లిని వ్యతిరేకించింది. మరి ఈ ప్రెగ్నెన్సీపై షోయబ్ లేదా సనా ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. త్వరలోనే స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.