Papaya: వీరు పొరపాటున అయినా బొప్పాయి తింటే.. పైకి పోవడం గ్యారెంటీ

Papaya:
పోషకాలు ఉండే ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది పండ్లు వంటివి తీసుకుంటారు. పండ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మిగతా పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని డైలీ తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని పొపైన్ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీన్ని రోజుకి చిన్న ముక్క తిన్న కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా కూడా కొన్ని పదార్థాలు కొందరికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. బొప్పాయి అందరి ఆరోగ్యానికి మేలు చేయదు. కొందరి ఆరోగ్యానికి మాత్రమే మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే అన్ని విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయిని ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
శ్వాసకోశ సమస్యలు
శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు బొప్పాయిని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయిలోని కొన్ని ఈ సమస్యలను తగ్గించకుండా పెంచుతాయి. దీనివల్ల అలెర్జీ కూడా వస్తుంది. కాబట్టి బొప్పాయిని వీరు తినకపోవడం మంచిది.
కడుపు సంబంధిత సమస్యలు
బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. కానీ అధికంగా తీసుకుంటే పేగు, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విరేచనాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బొప్పాయి బాడీకి వేడి చేస్తుంది. దీనివల్ల విరేచనాలు, కడుపు నొప్పి వంటివి కొన్నిసార్లు వస్తాయి. ఈ సమస్య ఉన్నవారు బొప్పాయిని తీసుకుంటే ఈ సమస్య ఇంకా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గర్భిణులు
గర్భిణులు అసలు బొప్పాయి జోలికి పోకూడదు. దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో కూడా గర్భిణులు బొప్పాయి తీసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. గర్భిణి అని తెలిసినప్పటి నుంచి బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది.
కిడ్నీ సమస్యలు
కొందరికి కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారు బొప్పాయిని అసలు తినకూడదు. బొప్పాయి తినడం వల్ల ఈ సమస్య పెరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యుల సూచనల మేరకు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీ
కొందరికి అలెర్జీ సమస్యలు ఉంటాయి. అలాంటి వారు బొప్పాయి తింటే సమస్య పెరుగుతుంది. సాధారణంగా చర్మ ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. కానీ అలెర్జీ సమస్యలు ఉంటే మాత్రం బొప్పాయి తీసుకోకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పచ్చ కామెర్లు ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదు. తింటే పచ్చకామెర్ల సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Health Benefits: ప్రతీ రోజు ఈ జ్యూస్ తాగితే.. ఈ సమస్యల నుంచి విముక్తి
-
Pain killers: ఈ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్ తీసుకున్నారో.. ఇక అంతే సంగతులు
-
Shoaib Malik: తండ్రి కాబోతున్న షోయబ్ మాలిక్.. మూడో భార్య ప్రెగ్నెంట్
-
Papaya: బొప్పాయి వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు నష్టాలు కూడా చాలా ఎక్కువే.. ఇంతకీ ఎవరు తినవద్దు అంటే?
-
Coconut water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు అధికంగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త