Singer kalpana: నా తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన కల్పన కుమార్తె

Singer kalpana:
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉంది. వెంటిలేటర్‌పై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. అయితే కల్పన భర్త కారణంగానే ఆత్మహత్యయత్నం చేసుకుందని ఆరోపించారు. కానీ దానికి భర్త కారణం కాదని కూతురు కారణంగా కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ రావాలని కల్పన కూతురిని కోరగా.. రానని తెలిపింది. దీంతో కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కల్పన కూతురు స్పందించింది. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని.. నిద్రమాత్రలు ఎక్కువ వేసుకోవడం వల్ల అసస్మారక స్థితిలోకి వెళ్లిందని తెలిపింది. అంతే కానీ ఆత్మహత్యాయాత్నం చేసిందని అసత్య ప్రచారాలు చేయవద్దని కోరింది. ప్రస్తుతం మా కుటుంబమంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నామని, త్వరలోనే తన తల్లి ఇంటికి వస్తుందని ఆమె క్లారిటీ ఇచ్చింది.
కల్పనా తన కూతురు వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన కూతురికి హైదరాబాద్ రమ్మంటే రాలేదని, అందుకే ఆత్యహత్యాయత్నం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటితో పాటు గతంతో పోలిస్తే ప్రస్తుతం కల్పనకు ఆఫర్లు తగ్గాయని అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకుందని పలువురు అంటున్నారు. ఏ కారణం వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందో అనే విషయం తెలియాలంటే మాత్రం తప్పకుండా పూర్తిగా కోలుకోవాల్సిందే. ఇదిలా ఉండగా సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు అయిన కల్పన హైదరాబాద్‌లోని నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్‌లో నివాసం ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కల్పన తీవ్ర మనస్తాపం చెంది బాధపడుతుంది. ఈ క్రమంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే రెండు రోజుల నుంచి ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పడక గదిలో ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే కల్పన భర్త చెన్నైలో ఉంటున్నారు. పోలీసులు వెంటనే ఈ విషయం చెప్పడంతో భర్త హైదరాబాద్ చేరుకున్నారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి దాంపత్య జీవితం ఏమైనా కారణమా అనే కోణంలో పోలీసులు ఆమె భర్తను విచారించారు. లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఇదిలా ఉండగా.. కల్పన సింగర్‌గా రాణిస్తున్నా కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయితే ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో గతంలో తెలియజేసింది. కల్పన భర్త ఓ వ్యాపారవేత్త. అతను తన కూతురును చూసుకుని 19 ఏళ్ల కూతురిని చూసుకుంటూ చెన్నైలో ఉంటారు.