Viral Video: ఇది కదా తండ్రి ప్రేమంటే.. ప్రాణాలు లెక్క చేయకుండా కూతురు కోసం.. వైరల్ వీడియో

Viral Video: సాధారణంగా రైల్వే స్టేషన్లకు వెళ్లినప్పుడు చాలా మంది ప్రయాణికులు ఎంతో తొందరగా ఉంటారు. ముఖ్యంగా కదులుతున్న రైలు ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రైల్వే అధికారులు తరచుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ప్రయాణికులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. అయితే సాధారణంగా రైలు వచ్చే సమయం అయితే కొందరు ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ, పట్టాలపై నడుస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. కానీ ఎవరూ కూడా దీన్ని పట్టించుకోకుండా మారుతుంటారు. అయితే ఓ యువతి ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లడానికి ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో, ఆమె కళ్ల ముందు వేగంగా ఒక రైలు దూసుకు వచ్చింది. షాక్‌కు గురై ఆమె రైలు పట్టాలకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో నిలబడిపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో బిక్కుమొహం వేసింది.
Read Also:WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..
ఈ విషయాన్ని గమనించిన ఆమె తండ్రి కూతురు కోసం రిస్క్ చేశాడు. తన కూతురు ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి పట్టాల పైకి దూకాడు. క్షణాల్లో ప్లాట్‌ఫామ్ వైపుకు వచ్చి, తన కూతురిని గట్టిగా హత్తుకుని పక్కకు లాగాడు. వాళ్లను ఆనుకుంటూనే వేగంగా రైలు దూసుకుపోయింది. అదృష్టం కొద్దీ, వారికి ఎలాంటి గాయాలు అయితే కాలేదు. తండ్రి, కూతురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో తన కూతురి కోసం తండ్రి చూపిన ప్రేమ, సాహసం చూసి అక్కడున్న వారందరూ ఎమోషనల్ అయ్యారు. వెంటనే కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరికొందరు ఎందుకు ఇలాంటి రిస్క్‌లు చేస్తారని మండిపడుతున్నారు.
Dad shields his daughter with his body after she stepped into a train’s pathpic.twitter.com/Blqs1UISc8
— Interesting things (@awkwardgoogle) June 16, 2025
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు