Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Singer Kalpana Wanted To Die Dream

Singer Kalpana: చనిపోవాలనిపించింది.. కల్పన బయటపెట్టిన సంచలన విషయాలు

Singer Kalpana: చనిపోవాలనిపించింది.. కల్పన బయటపెట్టిన సంచలన విషయాలు
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 5, 2025 / 09:30 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Singer Kalpana:

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. అదృష్టవశాత్తు బయటపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. కల్పన పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే స్పృహలోకి వచ్చిన కల్పన తాను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి గల కారణాలను బయటపెట్టింది. అందరూ కూడా భర్తతో విభేదాలు అని, భర్త కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆరోపించారు. కానీ తన ఆత్మహత్యాయత్నం భర్త కారణం కాదట. కూతురు కారణంగా కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ రావాలని కల్పన కూతురిని కోరగా.. రానని తెలిపింది. దీంతో కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తెలిపింది. అయితే కల్పన పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్తి విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం కల్పనకు ఆఫర్లు తగ్గాయని అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకుందని పలువురు అంటున్నారు. ఏ కారణం వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందో అనే విషయం తెలియాలంటే మాత్రం తప్పకుండా పూర్తిగా కోలుకోవాల్సిందే.

ఇదిలా ఉండగా సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు అయిన కల్పన హైదరాబాద్‌లోని నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్‌లో నివాసం ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కల్పన తీవ్ర మనస్తాపం చెంది బాధపడుతుంది. ఈ క్రమంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే రెండు రోజుల నుంచి ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పడక గదిలో ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే కల్పన భర్త చెన్నైలో ఉంటున్నారు. పోలీసులు వెంటనే ఈ విషయం చెప్పడంతో భర్త హైదరాబాద్ చేరుకున్నారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి దాంపత్య జీవితం ఏమైనా కారణమా అనే కోణంలో పోలీసులు ఆమె భర్తను విచారించారు. లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఇదిలా ఉండగా.. కల్పన సింగర్‌గా రాణిస్తున్నా కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయితే ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు ఓ ఇంట‌ర్వ్యూలో గతంలో తెలియజేసింది. కల్పన భర్త ఓ వ్యాపారవేత్త. అతను తన కూతురును చూసుకుని 19 ఏళ్ల కూతురిని చూసుకుంటూ చెన్నైలో ఉంటారు. అయితే ఎప్పటి నుంచి భర్తతో కాస్త గొడవలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

 

Tag

  • Dubbing artist
  • Issues
  • Singer Kalpana
Related News
  • Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు

  • CPR: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా సీపీ ఆర్ చేస్తే.. ప్రాణాలు సేఫ్

  • Early Morning: ఉదయం ఈ తప్పులు చేస్తే.. సంపద గోవిందా

  • Zodiac signs: రాహు కేతు మార్పులు.. ఈ రాశుల వారికి గడ్డు కాలమే

  • Kasi: ఈ కాశీలో స్నానాలు చేస్తే.. పాపాల నుంచి విముక్తి

  • Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us