Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ కు జోడిగా స్టార్ హీరోయిన్..ఆరుగురు హీరోయిన్స్ తర్వాత ఈ బ్యూటీ ఫిక్స్…
Vijay Deverakonda గౌతం తిన్న నూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోయే సినిమాకు కింగ్డమ్ టైటిల్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం విజయ్ రౌడీ జనార్ధన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Vijay Deverakonda: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఫుల్ క్రేజ్ ఉన్నవాళ్లలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన అభిమానులు కూడా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ వంటి ఫ్లాప్ సినిమా తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ తన కెరీర్లో చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఖాతాలో పెద్దగా హిట్స్ లేకపోయినా కూడా ఆయన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు అని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగు చాలా వేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్.
గౌతం తిన్న నూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోయే సినిమాకు కింగ్డమ్ టైటిల్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం విజయ్ రౌడీ జనార్ధన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక దర్శకుడు రవి కిరణ్ కొల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రవి కిరణ్ కొల్లా గతంలో రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యారు. రవి కిరణ్ కొల్లా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోయే సినిమా పేరు రౌడీ జనార్ధన్ అని 2025 మార్చిలో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఈ సినిమా నిర్మాత దిల్ రాజు అనుకోకుండా వెల్లడించారు. ఆ తర్వాత అఫీషియల్ గా కూడా ప్రకటించారు.
రౌడీ జనార్ధన్ అనే టైటిల్ విజయ్ దేవరకొండ రౌడీ ఇమేజ్ కు సరిగ్గా సరిపోతుందని సినిమా మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు జోడిగా ఇప్పటికే ఐదుగురు హీరోయిన్లను సంప్రదించినట్లు సమాచారం. విజయ్ జోడిగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం సినిమా మేకర్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆమె కూడా సినిమా నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆమె ప్లేస్ లో సినిమా యూనిట్ కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు టాక్.
View this post on Instagram
-
The Paradise Interesting Update: ది ప్యారడైజ్ గురించి ఆసక్తికర అప్డెట్
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
-
Kingdom Pre Release Event: కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్