Tamannaah Bhatia : ఆ విషయంలో బాలకృష్ణను ఫాలో అవుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా…

Tamannaah Bhatia :
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సామాన్యులతోపాటు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ మహాకుంభమేళాకు వెళ్లినవారు, అలాగే వచ్చిన వారు, ఆ దృశ్యాలను కలకాలం చూడాలనుకున్న వారి కోసం కూడా ఆలోచిస్తుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అఖండ 2 సినిమా యూనిట్ మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. ఇక రీసెంట్ గా ఓదెల 2 యూనిట్ అక్కడే సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఓదెల 2 సినిమాలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో తమన్నా టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది తమన్నా. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర రాణించలేకపోయింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమన్న హ్యాపీడేస్ సినిమాలో నటించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా తమన్నా క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. వరుసగా అవకాశాలు ఆమెకు చుట్టుముంటాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంటూ తమన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పటివరకు ఆమె తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించింది.
ప్రస్తుతం తమన్నా లేడి ఓరియెంటెడ్ సినిమా అయినా ఓదెల 2 లో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సినిమా యూనిట్ మహా కుంభమేళాలో రిలీజ్ చేసింది. శివశక్తిగా తమన్నా నటన మూవీ మేకర్స్ తో పాటు అందరిని ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఓదెల మొదటి భాగం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్ భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ ను అత్యంత భారీ బడ్జెట్ తో మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అలాగే మిల్క్ బ్యూటీ తమన్నాకు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వటం చాలా ముఖ్యం. ఈ రీసెంట్ టైమ్స్ లో తమన్నా ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ అయితే లేవు.
ఈ క్రమంలోనే ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా మీద తమన్న చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి శివశక్తిగా మిల్కీ బ్యూటీ తనను తాను పోట్రే చేస్తున్న విధానం కూడా ఇండస్ట్రీలో టాక్ అవుతుంది. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా భాటియాకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఇక మధ్యకాలంలో తమన్నా స్పెషల్ సాంగ్ లతో తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ఈ సినిమాకు ప్లస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.