Japan Baba Vanga prediction: జపాన్‌లో మరికొన్ని గంటల్లో ప్రళయం వస్తుందా.. ప్రజలను భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం

Japan Baba Vanga prediction: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. జులై 5వ తేదీన జపాన్‌లో భారీ భూకంపం సంభవిస్తుందని, ప్రపంచ పటంలో జపాన్ దేశం ఉండదని, కోట్లాది ప్రజలు చనిపోతారని నెట్టింగ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ జ్యోతిష్యం చెప్పంది.. బాబా వంగా అనే ఓ మహిళ. ఈమె తన పుస్తకంలో వీటిన్నింటి కోసం రాసింది. ఇంతకీ ఎవరీ బాబా వంగా? తన పుస్తకంలో ఏమేమి రాశారు? జపాన్ అంతం నిజమేనా? ఇంకా ప్రపంచంలో జరగబోయే వేటి గురించి రాశారు? అనే పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
జపాన్, పిలిప్పీన్స్ దేశాల మధ్యలో ఉన్న సముద్ర గర్భంలో సునామీ వస్తుందని, జపాన్ దేశం మొత్తం అంతం అవుతుందని బాబా వంగా తన పుస్తకంలో రాసింది. జులై 5వ తేదీన జపాన్‌లో సునామీ వస్తుందని, కోట్లాది మంది ప్రజలు చనిపోతారని తెలిపింది. ప్రపంచ పటంలో జపాన్ దేశం ఇకపై ఉండదని బాబా వంగా 1999లోనే తన పుస్తకంలో రాశారు. ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో బాబా వంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే బాబా వంగా అంటే చాలా మంది పురుషుడు అనుకుంటున్నారు. కానీ బాబా వంగా అంటే మహిళ. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్ కీ అనే ఆమెను బాబా వంగా అని పిలుస్తుంటారు. అయితే ఈమె భవిష్యత్తులో ఏం జరగుతుందని ముందుగానే ఊహించి 1999లో ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో రాశారు. అప్పట్లో ఈమెను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె పుస్తకంలో రాసినవన్ని కూడా ఆ తర్వాత జరగడంతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19, జపాన్‌లో భూకంపం వంటి విషయాల గురించి కూడా బాబా వంగా తన పుస్తకంలో రాసి ఉంది. ఇవన్నీ కూడా జరగడంతో జపాన్ అంతం కూడా జరుగుతందని జోరుగా ప్రచారం సాగుతోంది. జూన్ 5న జపాన్ అంతం అవుతుందని వార్తలు రావడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జపాన్ వెళ్లాలనుకునే టూరిస్టులు కూడా వారి టికెట్లను భయంతో క్యాన్సిల్ చేసుకుంటున్నారు. గతంలో బాబా వంగా చెప్పిన వ్యాఖ్యలు నిజం కాగా ఇప్పుడు కూడా నిజం అవుతుందని ప్రజలు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు.
బాబా వంగా తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలు జరిగాయి. 1995లో కోబ్ భూకంపం వస్తుందని తన పుస్తకంలో రాయగా జరిగింది. దీని తర్వాత 2011 తోహోలో భూకంపం, కరోనా వైరస్, అలాగే ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం కూడా ఉంటుందని కూడా రాశారు. అయితే అప్పుడు పుస్తకంలో రాసినవి అన్ని నిజం కావడంతో జపాన్ అంతం కూడా నిజమేనని ప్రజలు నమ్ముతున్నారు. మరి నిజంగానే జపాన్ అంతం తప్పదా? మరి కొన్ని గంటల్లో జపాన్ ప్రజలు చనిపోతారా? ప్రపంచ పటంలో జపాన్ ఉండదా? అనే విషయం తెలియాలంటే మాత్రం కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సిందే.
Also Read: Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?