Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • International News News »
  • The Fascinating Journey Of Frances First Couple Emmanuel And Brigitte Macron

Emmanuel Macron Love Story : 42 ఏళ్ల మెక్రాన్, 72 ఏళ్ల టీచర్ బ్రిగిట్టా.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ‘లవ్ స్టోరీ’పై మరోసారి చర్చ!

Emmanuel Macron Love Story : 42 ఏళ్ల మెక్రాన్, 72 ఏళ్ల టీచర్ బ్రిగిట్టా.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ‘లవ్ స్టోరీ’పై మరోసారి చర్చ!
  • Edited By: rocky,
  • Updated on May 27, 2025 / 09:42 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Emmanuel Macron Love Story : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి ఫ్రాన్స్. దాని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron). ఆయన రాజకీయ జీవితం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఆయన ప్రేమ కథ అంతకంటే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆయన, ఆయన సతీమణి బ్రిగిట్టా (Brigitte Macron) వార్తల్లో నిలిచారు. ఇటీవల వియత్నాం పర్యటనలో జరిగిన ఒక చిన్న సంఘటన వారి వ్యక్తిగత జీవితాన్ని మళ్లీ చర్చనీయాంశం చేసింది. అయితే, ఈ చిన్న వీడియో క్లిప్ వెనుక దాగి ఉన్నది కేవలం ఒక సరదా సన్నివేశమేనని మెక్రాన్ స్వయంగా స్పష్టం చేశారు. అసలు 15 ఏళ్ల వయసులో 39 ఏళ్ల టీచర్‌తో మొదలైన ప్రేమ కథ… ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేతను ఎలా చేసింది? అన్ని అడ్డంకులను ఛేదించుకుని ఈ బంధం ఎలా నిలబడిందో తెలుసుకుందాం.

ఈ అద్భుత ప్రేమ కథ మొదలైంది 1993లో, ఫ్రాన్స్‌లోని అమియెన్స్‌లో ఉన్న కేథలిక్ లైసీ లా ప్రావిడెన్స్ పాఠశాలలో. బ్రిగిట్టా అప్పటికి 39 ఏళ్ల టీచర్, మెక్రాన్ ఆమెకు 15 ఏళ్ల విద్యార్థి. మెక్రాన్ అప్పటికే 25 ఏళ్ల యువకుడిలా పరిణతి చెందినవాడని, తన క్లాస్‌మేట్స్‌తో కాకుండా టీచర్లతోనే ఎక్కువగా మాట్లాడేవాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. బ్రిగిట్టా అప్పటికే ఆండ్రీ లూయిస్ అనే బ్యాంకర్‌తో వివాహమై, ముగ్గురు పిల్లల తల్లి. వారి పెద్ద కుమార్తె, మెక్రాన్ ఒకే క్లాస్‌మేట్స్ కూడా.

Read Also:Viral Video : ఏనుగు తెలివికి అవాక్కైన ప్రపంచం.. ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!

మియల్లీ బ్రన్ రాసిన బ్రిగిట్టా జీవిత చరిత్ర ‘యాన్ అన్‌పెటర్డ్ విమెన్’ ప్రకారం, 1994లో మెక్రాన్, బ్రిగిట్టా ఒక కొలనులో కలిసి కనిపించడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బ్రిగిట్టా తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచీ వీరి బంధం బలపడటం మొదలైంది. మెక్రాన్ ఉన్నత చదువుల కోసం పారిస్ వెళ్లినప్పటికీ, బ్రిగిట్టాతో తన సంబంధాన్ని కొనసాగించాడు. దూరం వారి బంధాన్ని మరింత బలపరిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, సామాజిక విమర్శలను తట్టుకుని 2007లో మెక్రాన్, బ్రిగిట్టా వివాహం చేసుకున్నారు. ఆసక్తికరంగా, బ్రిగిట్టాకు 1974లో మొదటి వివాహం జరిగిన లీ టాంక్వెట్ బీచ్‌లోనే ఈ రెండో వివాహం కూడా జరిగింది.

ఓ ఇంటర్వ్యూలో బ్రిగిట్టా మాట్లాడుతూ.. “వయసులో తేడా చాలా ఎక్కువ. మా ప్రేమ కొనసాగదని, అతడికి సరిపోయే వారు దొరికితే వెళ్లిపోతాడని అనుకున్నాను” అని సరదాగా చెప్పారు. కానీ మెక్రాన్ మాత్రం తన ప్రేమకు కట్టుబడి ఉన్నాడు. 2014లో మెక్రాన్ ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే, బ్రిగిట్టా తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆయనకు అండగా నిలిచారు. అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఈ జంటపై అనేక పుకార్లు షికారు చేశాయి. మెక్రాన్, రేడియో ఫ్రాన్స్ అధిపతితో రహస్య సంబంధాలు నడుపుతున్నారని బ్రిగిట్టా దాన్ని కవర్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వీటిని బ్రిగిట్టా తీవ్రంగా ఖండించారు. తన జీవితంలో అవే అత్యంత బాధాకరమైన క్షణాలని చెప్పారు.

Read Also:Viral Video: ప్రేయసి కోసం ఏకంగా.. స్పెయిన్ ప్రిన్సెన్‌ను రిజక్ట్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

తాజాగా వియత్నాం పర్యటనలో జరిగిన చిన్న సంఘటనపై పుకార్లు రేగడంతో మెక్రాన్ మరోసారి స్పందించి “మా ఇద్దరి ప్రేమ ఇంకా చెక్కు చెరిగిపోలేదు” అని స్పష్టమైన సందేశమిచ్చారు. వయసుతో సంబంధం లేని ఈ బంధం, సామాజిక విమర్శలను, రాజకీయ ఆరోపణలను తట్టుకుని నిలబడటమే కాదు. అనేక మందికి ఆశ్చర్యాన్ని, స్ఫూర్తిని కూడా ఇస్తోంది. ఇది నిజమైన ప్రేమకు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికి నిదర్శనం.

Tag

  • Age Gap Relationship
  • Brigitte Macron
  • Emmanuel Macron Love Story
  • French President
  • Teacher Student Romance
Related News
    Latest Photo Gallery
    • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us