Beauty Parlours: పార్లర్ కు వెళ్తున్నారా? ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా?

Beauty Parlours:
అమ్మాయిలు అందం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇక పార్లర్ కు వెళ్లడం మాత్రం ముఖ్యంగా మారింది ప్రస్తుతం. పార్లర్ కి వెళ్లి అందాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండానే మీ స్కిన్ ను మీరే పాడు చేసుకుంటున్నారు అని మీకు తెలుసా? చాలా సమస్యల సుడిగుండలో పడుతున్నారు కూడా. అవును తరచుగా కొన్ని తప్పులు కామన్ గా జరుగుతుంటాయి. దాని వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది. ఇంతకీ పార్లర్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి. ఏ తప్పుల వల్ల ఆ సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ పార్టీ అయినా, జనాలు పార్లర్‌కి వెళ్లి మేకప్ వేసుకోవడానికి ఇష్టపడతారు. త్రెడింగ్ నుంచి ఫేషియల్, హెయిర్ కట్, మానిక్యూర్-పెడిక్యూర్, మేకప్ వరకు, ప్రజలు పార్లర్‌లో మాత్రమే రెడీ అవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా తయారు అయింది. కానీ తరచుగా కొన్ని తప్పులు చేయడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక పార్లర్‌లో ఏదైనా మేకప్ ట్రీట్‌మెంట్ లేదా మేకప్ చేయించుకునే ముందు మహిళలు చేసే సాధారణ మిస్టేక్ వల్ల చర్మం చాలా దెబ్బతినాల్సి వస్తుంది.
ఒక రోజులో చాలా మంది మేకప్ చేయించుకోవడానికి పార్లర్‌కి వస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, బ్రష్‌లు మురికిగా ఉంటాయి. అదే బ్రష్‌ను ముఖంపై పదే పదే ఉపయోగించడం వల్ల చర్మ అలెర్జీ సమస్యలు వస్తాయి. ఇతరులకు ఉన్న సమస్యలు కూడా మీకు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల సున్నితమైన చర్మం ఏర్పడుతుంది. మేకప్ నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు ప్రతిదాన్ని ఎంచుకునేటప్పుడు డేట్ అయిపోయిన మేకప్ వాడుతుంటారు. దీనివల్ల చర్మం చాలా పొడిగా మారుతుంది.
అది పార్లర్ అయినా లేదా పురుషుల సెలూన్ అయినా, అత్యంత సాధారణ తప్పు ఏమిటంటే పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అంటున్నారు నిపుణులు. అందరికీ ఉపయోగించే ఒక సాధారణ టవల్ ఉంటుంది. చేతులు శుభ్రం చేసుకోవడం నుంచి ఇతరులకు శుభ్రం చేయడం వరకు అందరూ దాన్నే ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు చేతులు కూడా దానితోనే తూడుచుకుంటారు. సో మీరు టిష్యూలను వాడండి. వెట్ టిష్యూ మీ వెంట తీసుకొని వెళ్లండి. లేదంటే పార్లర్ లో ఉంటాయి అడిగి తీసుకోండి. బట్ అందరూ ఉపయోగించిన టవల్ ను మీరు ఉపయోగించవద్దు. వారు ఉపయోగించినా సరే వద్దని చెప్పండి.
పార్లర్‌లో సాధారణంగా చేసే పని ఫేషియల్, థ్రెడింగ్, వ్యాక్సింగ్, మానిక్యూర్-పెడిక్యూర్. అయితే దారం నుంచి నీటి తొట్టి వరకు, దానిలో ఉపయోగించే పరికరాల పరిశుభ్రత, అలాగే ముఖ చర్మ సంరక్షణ సమయంలో చేతుల శుభ్రత గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Beauty Tips: సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ముందుగా దేన్ని అప్లై చేయాలి?
-
Beauty Tips : అకాల వృద్దాప్యంతో బాధ పడుతున్నారా? మొహం మీద ముడతలు వచ్చేశాయా? జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి..
-
Beauty Tips: ఇంతకీ రోజుకు ఎన్ని సార్లు మొహం క్లీన్ చేసుకోవాలి? ఎవరు ఎలాంటి ఫేస్ వాష్ ఎంచుకోవాలి?