Beauty Tips: ఇంతకీ రోజుకు ఎన్ని సార్లు మొహం క్లీన్ చేసుకోవాలి? ఎవరు ఎలాంటి ఫేస్ వాష్ ఎంచుకోవాలి?

Beauty Tips:
ఉదయం స్నానం చేస్తే సరిపోతుంది ఇక మొహం ఎందుకు కడగడం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు చాలా మంది. మీరు కూడా ఇందులో మెంబర్సా? కొందరు ఆలస్యం అయితే స్నానం కూడా చేయరు. బట్టలు మార్చుకొని వెళ్తుంటారు. వచ్చాక సాయంత్రం అసలు స్నానం చేయరు. కనీసం మొహం కూడా క్లీన్ చేసుకోరు. మళ్లీ నా ఫేస్ బాగలేదు. మచ్చలు, జిడ్డు అంటూ బాధ పడతారు. సమస్య మీరే పెంచుతున్నారు కదా. ఇంతకీ మొహం ఎన్ని సార్లు శుభ్రం చేసుకోవాలి. ఏ సమయంలో శుభ్రం చేసుకోవాలి? ఎలాంటి స్కిన్ ఉన్నవారు ఏ స్క్రబ్ లు వాడాలి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. ఉదయం ముఖం కడుక్కోవడం వల్ల రాత్రిపూట పేరుకుపోయిన మురికి, నూనె తొలగిపోతాయి. రాత్రిపూట ముఖం కడుక్కోవడం వల్ల పగటి దుమ్ము, కాలుష్యం తొలగిపోతుంది. సో కామన్ గా మీరు అర్థం చేసుకున్నా సరే ఈ విషయం క్లారిటీ వస్తుంది. అవును ఇది మీకు కూడా తెలుసు. కానీ బద్దకం కొన్ని సార్లు, సమయం లేకపోవడం వల్ల మరికొన్ని సార్లు మీరు మొహాన్ని శుభ్రం చేసుకోవడం లేదు కదా. కానీ బద్దకం అయినా సరే బిజీ అయినా సరే మీరు ఫేస్ ను క్లీన్ చేసుకోవాల్సిందే. చర్మ రకాన్ని బట్టి దీనిని అనుసరించవచ్చు. ఇప్పుడు ఏ చర్మ రకానికి ఫేస్ వాష్ అవసరం? ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేయాలో కూడా తెలుసుకుందాం.
జిడ్డు, మొటిమల మొహం:
మీ చర్మం జిడ్డుగా ఉంటే లేదా మీకు మొటిమల సమస్యలు ఉంటే, మీరు రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాల్సిందే. మీ చర్మం ఎక్కువగా జిడ్డుగా ఉన్నప్పుడు, రోజుకు రెండుసార్లు కడుక్కోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. కొన్ని సార్లు, కౌమారదశలో లేదా మీరు ఆటలు ఆడుతున్నప్పుడు, ముఖాన్ని మూడు సార్లు కూడా కడగాల్సి వస్తుంది. మొటిమలు రాకుండా చర్మం నుంచి చెమటను త్వరగా తొలగించాలి.
పొడి – సున్నితమైన చర్మం
మీ చర్మం పొడిగా లేదా సున్నితంగా ఉంటే, రోజుకు రెండుసార్లు ముఖం కడగవద్దు. జస్ట్ ఉదయం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక రాత్రిపూట తేలికపాటి క్లెన్సర్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ స్కిన్ సహజ తేమను చెక్కుచెదరకుండా ఉంచవచ్చు. పొడిబారడం పెరగదు. ఇక మీ చర్మం సున్నితంగా ఉంటే, మీరు సున్నితమైన, సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోవాలి.
కాంబినేషన్ స్కిన్
మీది కాంబినేషన్ స్కిన్ అయితే రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోండి. కానీ మీ చర్మం పొడిగా లేదా దురదగా అనిపిస్తే, మీరు హైడ్రేటింగ్ క్రీమీ క్లెన్సర్‌ని ఉపయోగించాలనుకోవచ్చు.
ఎక్కువగా క్లీన్ చేయవచ్చా లేదా?
చాలా మంది ముఖం ఎంత ఎక్కువగా కడుక్కుంటే, చర్మం అంత శుభ్రంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఎక్కువగా కడగడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది అని కొందరి అనుమానం కూడా. ఎక్కువగా ముఖం కడుక్కోవడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలు తొలగిపోతాయి . ఇది మీ చర్మాన్ని పొడిబారిస్తుంది. చికాకును కూడా కలిగిస్తుంది. కాబట్టి, ఫేస్ వాష్ ప్రక్రియను సమతుల్యంగా ఉంచండి. మీరు ఎక్కువగా కడగడం అలవాటు చేసుకుంటే, అది మీ చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. ముఖ్యంగా మీ చర్మం ఇప్పటికే పొడిగా ఉంటే దీన్ని మరింత స్కిప్ చేసేయండి.
రెండుసార్లు శుభ్రపరచడం అవసరమా?
మీరు మేకప్ వేసుకుంటే, డబుల్ క్లెన్సింగ్ ప్రక్రియను అనుసరించడం ప్రయోజనకరం. మొదట మేకప్ రిమూవర్ లేదా ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌ని ఉపయోగించాలి. ఇది మేకప్, మురికిని బాగా తొలగిస్తుంది. దీని తర్వాత ముఖాన్ని తేలికపాటి క్లెన్సర్‌తో కడుక్కోవాలి.
మేకప్ వేసుకోకపోతే, రెండుసార్లు శుభ్రపరచడం అవసరం లేదు. ఇది మీ చర్మంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. పొడిబారడాన్ని పెంచుతుంది.
మీరు ఫేస్ వైప్స్ వాడాలా వద్దా?
ఫేస్ వైప్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు బయట ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు వాడండి. కానీ వాటిని అప్పుడప్పుడు మాత్రమే వాడాలి. ఎందుకంటే వాటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చర్మానికి హాని కలిగే అవకాశం ఉంది. ఈ వైప్స్‌లో తరచుగా ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి చర్మానికి హానికరం. రుద్దడం వల్ల మీ చర్మం సహజ అవరోధం బలహీనపడుతుంది.
స్నానం చేసేటప్పుడు మొహం క్లీన్?
కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు ముఖం కడుక్కోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని అనుకుంటారు. కానీ మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్టే. స్నానం చేసేటప్పుడు ముఖం కడుక్కోవడం, సింక్ లో ముఖం కడుక్కోవడం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో, అంతే ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. స్నానం చేసేటప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఫేస్ ను క్లీన్ చేసుకోవచ్చు.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Beauty Tips: సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ముందుగా దేన్ని అప్లై చేయాలి?
-
Beauty Tips : అకాల వృద్దాప్యంతో బాధ పడుతున్నారా? మొహం మీద ముడతలు వచ్చేశాయా? జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి..
-
Beauty Parlours: పార్లర్ కు వెళ్తున్నారా? ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా?