Beauty Tips : ఫేస్ ఫుల్ గా టాన్ అయిందా? జస్ట్ సింపుల్, ఆలూ, టమాటా, ఖీర్ చాలు

Beauty Tips : చాలా మంది టాన్ తొలగించడానికి అత్యంత ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయినా సరే మంచి ఫలితాలు రావడం లేదు. అయితే ఎండలో ఎక్కువ సమయం ఉంటే మీ చర్మం టాన్ అవుతుంది. ఇక ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత కూడా పెద్దగా ఫలితం కనిపించదు. సో జస్ట్ వంటగదిలో ఉన్న వాటితో ఈ టాన్ ను ఎలా తొలగించుకోవాలో చూసేద్దామా?
కొన్ని పదార్థాలు టానింగ్‌ను తొలగించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి అంటున్నారు నిపుణులు. వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చర్మంపై వాటి దుష్ప్రభావాల అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక మీరు ఇంట్లో లభించే వస్తువులను మీ చర్మ సంరక్షణ దినచర్యలో సులభంగా భాగం చేసుకోవచ్చు. కాబట్టి వంటగదిలో ఏ కూరగాయలు ఉన్నాయో, వాటి సహాయంతో టాన్ ను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంప:
ఆలు టమాట కర్రీ చేసినా లేదంటే ఫ్రై చేసినా భలే ఉంటుంది కదా. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ తినడానికి మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సహజ బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బంగాళాదుంపలను తొక్క తీసి మెత్తగా రుబ్బి, దాని రసాన్ని తీసి, టాన్ అయిన ప్రదేశంలో రాయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే మీకు కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.
ఖీర్:
చర్మానికి దోసకాయ కూడా ఒక వరం లాంటిది. ఇందులో పుష్కలంగా నీరు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని చల్లబరుస్తాయి. టానింగ్ తొలగించడంలో సహాయపడతాయి. దోసకాయ రసం తీసి ముఖం, చేతులకు పూయాలి. లేదా సన్నని ముక్కలుగా కట్ చేసి టాన్ అయిన ప్రదేశంలో పెట్టినా సరిపోతుంది. దీనివల్ల చర్మం మృదువుగా, తాజాగా అవుతుంది.
టమాట:
టాన్ ను తొలగించడంలో టమోటా కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది. టాన్ ను తగ్గిస్తుంది. టమోటాను గ్రైండ్ చేసి, దానికి కొంచెం పెరుగు కలిపి పేస్ట్ లా చేసి ముఖం, చేతులు, కాళ్ళకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని సహజంగా ప్రకాశవంతంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది.
ఈ సింపుల్, నేచురల్ పదార్థాలను ఉపయోగించి మీరు ఎటువంటి రసాయన ఉత్పత్తులను ఉపయోగించకుండా ఇంట్లోనే టాన్ ను తొలగించుకోవచ్చు. అలాగే, ఎండలో బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ రాసుకోవడం, చర్మాన్ని కప్పి ఉంచడం చాలా ముఖ్యం. తద్వారా మళ్ళీ టాన్ రాదు కూడా. మీరు సహజమైన వస్తువులతో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Beauty Tips: సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ముందుగా దేన్ని అప్లై చేయాలి?
-
Beauty Tips : అకాల వృద్దాప్యంతో బాధ పడుతున్నారా? మొహం మీద ముడతలు వచ్చేశాయా? జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి..
-
Beauty Tips: ఇంతకీ రోజుకు ఎన్ని సార్లు మొహం క్లీన్ చేసుకోవాలి? ఎవరు ఎలాంటి ఫేస్ వాష్ ఎంచుకోవాలి?