Coconut water : వీరు కొబ్బరి నీరు అసలు తాగవద్దు. తాగితే అంతే సంగతులు..

Coconut water :
ఎండాకాలం వచ్చేసింది. చలికాలం వెళ్లడంతో ఎండలు మండుతున్నాయి. ఇంట్లో నుంచి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలి అంటేనే భయం వేసేలా ఉంది. ఆ రేంజ్ లో ఉన్నాయి ఎండలు. మరి ఇలా ఎండలు ఉంటే ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు మస్ట్ గా తీసుకోవాల్సిందే. అందుకే నీరు ఎక్కువ తీసుకుంటారు. ఇక ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు కొందరు. అంతేనా హైడ్రేట్ గా ఉండటానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే కొందరు బయటకు వెళ్తే కచ్చితంగా కొబ్బరి నీరును తీసుకుంటారు. వేసవిలో చాలా మంది దీనిని తాగడానికి ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఓ నమ్మకం ఉంది. మరి ఈ నీటిని అందరూ తాగవచ్చా? అసలు కొబ్బరి నీరు శరీరానికి మంచిదా కాదా అనే వివరాలు తెలుసుకుందాం.
అందుకే రెండవ ఆప్షన లేకుండా కనిపిస్తే తాగాలి అనిపిస్తే చాలు తాగేస్తుంటారు ప్రజలు. రోజూ కొబ్బరి నీళ్లు తాగే అలవాటు వల్ల కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరం కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలా హానికరం కూడా చూసేద్దాం. ముఖ్యంగా వృద్ధులు దానికి దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అయితే అందరికీ కాదు కానీ కొందరు మాత్రం దూరంగా ఉండాల్సిందేనట.
కొబ్బరి నీళ్లు ఎవరు తాగకూడదు?
కొబ్బరి నీటిని సాధారణంగా రీహైడ్రేటింగ్ పానీయంగా పరిగణిస్తారు . అందుకే వేసవిలో ప్రజలు దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అయితే, వైద్యుల అభిప్రాయం ప్రకారం, కొబ్బరి నీళ్లు రోజూ తాగగలిగేంత ఆరోగ్యకరమైనవి కావు. ముఖ్యంగా వృద్ధులకు. ప్రతిరోజూ దీన్ని తాగడం హానికరం. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది, ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది.
కొబ్బరి నీళ్లు ఎంత తాగాలి: ముఖ్యంగా వృద్ధులు కొబ్బరి నీళ్ళు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది గుండె పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. మీరు ఎండలో ఉంటే లేదా ఎక్కువగా చెమటలు పడుతుంటే, కొద్దిగా కొబ్బరి నీళ్లు తాగితే సరిపోతుంది. కానీ ప్రతి రోజు మాత్రం తీసుకోవద్దు.
శరీరంలో పొటాషియం పెరిగితే ఏమవుతుంది?
వైద్యపరంగా హైపర్‌కలేమియా అనే అధిక పొటాషియం స్థాయిలు గుండె పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ఇది క్రమరహిత హృదయ స్పందనలకు దారితీస్తుంది. లేదా కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారిలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.