Coconut Water: కొబ్బరి నీరు తాగే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Coconut Water కొబ్బరి నీరు తాగాలని చాలా మంది బాటిల్లతో ఇంటికి తీసుకొచ్చి నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత కొంచెం కొంచెం తాగుతుంటారు. అయితే వీటిని తాగేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.

Coconut Water: సీజన్‌తో సంబంధం లేకుండా చాలా మంది కొబ్బరి నీరు తాగుతుంటారు. ముఖ్యంగా వేసవిలో అయితే ఎక్కువగా తాగుతారు. నిజం చెప్పాలంటే రోజులో ఒక రెండు లేదా మూడు సార్లు అయినా కొబ్బరి నీరు తాగుతుంటారు. అయితే కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదని, వీటిని ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిదని భావిస్తుంటారు. కొందరు అయితే వీటిని ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసుకుని మరి తాగుతారు. కొబ్బరి నీరులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. కానీ కొందరు తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల వీటిని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే కొబ్బరి నీరు తాగేటప్పుడు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొబ్బరి నీరు తాగాలని చాలా మంది బాటిల్లతో ఇంటికి తీసుకొచ్చి నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత కొంచెం కొంచెం తాగుతుంటారు. అయితే వీటిని తాగేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. లేకపోతే ప్రాణాల మీదకు వస్తుందని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నీరును ఎక్కువ సమయం నిల్వ ఉంచకూడదు. ఇలా ఉంచితే నీరు పుల్లగా మారుతుంది. అప్పుడు అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇలా బ్యాక్టీరియా ఉన్న నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాడవుతుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి కూడా ఇలా నిల్వ ఉంచిన కొబ్బరి నీటిని తాగి మృతి చెందాడు. కొందరు కొబ్బరి నీళ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచుకుని మరి తాగుతారు. ఇలా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఫిడ్జ్‌లో కొబ్బరి నీటిని నిల్వ ఉంచితే వాటి టేస్ట్ మారిపోతుంది. ఫ్రిడ్జ్‌లోని బ్యాక్టీరియా కూడా అందులో చేరుతుంది. ఇలా కొబ్బరి నీరు తాగితే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొబ్బరి నీటిని ఎప్పుడూ కూడా ఫ్రెష్‌గానే తాగండి. నిల్వ ఉంచుకుని తాగితే మీ ప్రాణాలు పోవాల్సి వస్తుంది.
కొబ్బరి నీళ్లను తక్కువ ఉష్ణో్గ్రతల వద్ద తక్కువ సమయంలో మాత్రమే నిల్వ చేయాలి. నిజానికి చెట్టు నుంచి దించిన మూడు లేదా నాలుగు రోజుల్లో కొబ్బరి బొండాంలోని నీటిని తాగాలి. అంతే కానీ బొండాలు ఇంటికి తీసుకొచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుని తాగకూడదు. వీటివల్ల కూడా బ్యాక్టీరియా పేరుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొబ్బరి నీళ్లను ఉదయం తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలోని పోషకాలు బాడీకి చలవ చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదయాన్నే వీటిని తాగితే రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు. అలసట, నీరసం వంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.