Coconut water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు అధికంగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Coconut water:
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తాగడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. బాడీకి చలవ చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి నీరసం, అలసట లేకుండా ఫ్రెష్‌గా కూడా ఉంటారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు తప్పకుండా రోజులో ఒక్కసారైనా కొందరు కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసే పదార్థం అయినా కూడా మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లిమిట్ దాటి ఎక్కువగా తీసుకుంటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీళ్లను కూడా మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఎక్కువగా తీసుకుంటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో చూద్దాం.
కొబ్బరి నీళ్లను అధికంగా తాగడం వల్ల హైపర్ కలేమియా సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీర మోతాదుకి మించి తీసుకుంటే పొటాషియం లెవెల్స్ పెరిగిపోయి కలేమియా సమస్య బారిన పడతారు. అలాగే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలోని పొటాషియం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. దీంతో కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అధికంగా కొబ్బరి నీరు తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉండదు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా అధికంగా కొబ్బరి నీరు తాగుతుంటారు. ఇలాంటి వారు కొబ్బరి నీరు తాగకపోవడం మంచిది. ఒకవేళ తాగినా తక్కువ మోతాదులో మాత్రమే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లు అందరికీ కూడా మంచివి కావు. వీటి వల్ల అలెర్జీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ మోతాదులో తీసుకుంటే అలెర్జీ సమస్యలు తగ్గుతాయి. సహజంగా కొబ్బరి నీళ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు కొబ్బరి నీరు తాగకపోవడమే ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా అల్సరేటివ్ కొలిటిస్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
Coconut Water: కొబ్బరి నీరు తాగే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Coconut Water: వారానికి మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందంటే?
-
Health Benefits: ప్రతీ రోజు ఈ జ్యూస్ తాగితే.. ఈ సమస్యల నుంచి విముక్తి
-
Pain killers: ఈ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్ తీసుకున్నారో.. ఇక అంతే సంగతులు
-
Papaya: వీరు పొరపాటున అయినా బొప్పాయి తింటే.. పైకి పోవడం గ్యారెంటీ
-
Coconut water : వీరు కొబ్బరి నీరు అసలు తాగవద్దు. తాగితే అంతే సంగతులు..