Watermelon: రోజూ పుచ్చకాయ తింటే ఏమవుతుందంటే?
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలే కనిపిస్తాయి. వీటిని వేసవిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు

Watermelon:
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలే కనిపిస్తాయి. వీటిని వేసవిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని వాటర్ వల్ల వేసవిలో హైడ్రేట్‌గా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువ మంది వేసవిలో డైలీ తింటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మంచివే. కానీ డైలీ తినవచ్చా? తింటే ఏమవుతుంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే. ఇందులో లైకోపీన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అయితే ఎంత ఆరోగ్యానికి మంచిదైనా కూడా రోజూ ఎక్కువగా తినకూడదు. భోజనం చేసిన తర్వాత కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే రోజు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల తొందరగా బరువు పెరగరు. పుచ్చకాయను డైరెక్ట్‌గా తినడం లేదా జ్యూస్ కూడా తాగవచ్చు. దీనివల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అయితే చాలా మంది దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటారు. అయితే తక్కువగా మాత్రమే ఇలా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ ఎ, సి, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తపోటును కూడా తగ్గిస్తాయి. పుచ్చకాయలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు గుండె పోటు రాకుండా కాపాడుతుంది.
పుచ్చకాయలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో అర్జినైన్‌గా మారుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే సూర్య కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. చర్మంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు రాకుండా కాపాడుతుంది. ముఖం కాంతివంతంగా ఉండేలా చేయడంతో పాటు యంగ్ లుక్‌లో ఉండేలా చేస్తుంది. అలాగే పొడి చర్మం ఉన్న సమస్యను తగ్గిస్తుంది. వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీని కూల్‌గా ఉంచుతుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. పుచ్చకాయ వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Summer Fruit: సమ్మర్లో దొరికే ఈ ఫ్రూట్ తింటే.. రోగాలన్నీ పరార్
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Summer : సమ్మర్ లో ప్రయాణమా? ఇవి మస్ట్..
-
Watermelon : పుచ్చకాయ తియ్యగా ఉందని ఇలా తెలుసుకోండి.
-
Health Benefits: ప్రతీ రోజు ఈ జ్యూస్ తాగితే.. ఈ సమస్యల నుంచి విముక్తి