Covid 19 : కోవిడ్ వ్యాక్సిన్‌తో గుండెకు ప్రమాదం? ‘టీకాపై ఈ హెచ్చరిక రాయాల్సిందే అన్న FDA

Covid 19 : ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కీలక నిర్ణయం తీసుకుంది. ఫైజర్, మోడర్నా వంటి కంపెనీలు తమ కోవిడ్-19 వ్యాక్సిన్లపై గుండె సంబంధిత సమస్యలైన మయోకార్డిటిస్ (Myocarditis), పెరికార్డిటిస్ (Pericarditis) వంటి వాటికి సంబంధించిన సాధ్యమైన ప్రమాదం గురించి ఒక హెచ్చరికను రాయాలని ఆదేశించింది. వ్యాక్సిన్లు వేయించుకోవాలనుకునే వారికి వాటి వల్ల కలిగే నష్టాల గురించి ముందే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ హెచ్చరికను జారీ చేశారు.
మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ అంటే ఏమిటి?
FDA ఆదేశాల ప్రకారం.. వ్యాక్సిన్ మీద మయోకార్డిటిస్ గురించి హెచ్చరిక ఉండాలి. ఇది గుండె కండరాల వాపు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇది ఒక దుష్ప్రభావంగా మారవచ్చు. అదేవిధంగా, పెరికార్డిటిస్ గురించి కూడా రాయాలి. ఇది గుండె చుట్టూ ఉండే పొర వాపు . ఇది కూడా వ్యాక్సిన్ వల్ల సంభవించవచ్చు. మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ రెండూ గుండె జబ్బులే, ఇవి గుండెపోటు (Heart Attack) నుంచి గుండె వైఫల్యం (Heart Failure) వరకు దారితీయవచ్చు.
Read Also:Good News: డీఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. ఫ్రీ మాక్ టెస్ట్‌లు
వాస్తవానికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదం పెరిగిందనే వాదనలు వేగంగా పెరిగాయి. కోవిడ్ వ్యాక్సిన్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆదేశాలను జారీ చేసింది.
వ్యాక్సిన్లపై గతంలోనూ ప్రశ్నలు
కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల గుండెకు నష్టం జరుగుతుందని గతంలో కూడా వాదనలు వచ్చాయి. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) కూడా ఈ వాదనలను తోసిపుచ్చాయి. ఇప్పుడు FDA ఈ కంపెనీలకు తమ వ్యాక్సిన్ లేబుల్‌పై ఈ సాధ్యమైన ప్రమాదం గురించి సమాచారాన్ని చేర్చాలని ఆదేశించింది. వ్యాక్సిన్ భద్రత గురించి మరింత సమాచారం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి లేదా ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఈ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. వ్యాక్సిన్ భద్రత, ఎఫెక్టివ్ నెస్ గురించి మరింత సమాచారం కోసం ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచింది.
Read Also:Fridge water:మట్టికుండే బెటర్.. ఫ్రిజ్ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా ?
మళ్ళీ పెరుగుతున్న కరోనా ముప్పు
కరోనా వైరస్ ముప్పు మళ్ళీ పెరుగుతోంది. సింగపూర్ నుంచి భారతదేశం వరకు ఈ వైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈసారి కరోనాకు ఒక కొత్త సబ్ వేరియంట్ వచ్చింది. దీని పేరు JN.1 వేరియంట్. అయితే, ఈ వేరియంట్ అంతకు ముందు కంటే ఎక్కువ ప్రమాదకరమైనదని లేదా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు లేవు. కాబట్టి, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ రోగనిరోధక శక్తి (Immunity) బలహీనపడిన వారు. గతంలో కోవిడ్ వల్ల తీవ్రమైన ప్రమాదం ఎదుర్కొన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనితో పాటు, గుండె జబ్బులు, కిడ్నీ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.