Ghee: చెట్టు నుంచి నెయ్యి వస్తుంది? బెల్లం వస్తుంది? ఎలా? ఎక్కడ?

Ghee: కొన్ని మొక్కలు, గింజల గురించి చాలా మందికి తెలియదు. ఇంటి చుట్టు పెరుగుతున్నా సరే వాటి ప్రయోజనాలు మాత్రం అసలు తెలియదు. కానీ కొన్ని మొక్కలు దివ్యౌషధాలు అని చెప్పవచ్చు. వాటి వల్ల ఎన్నో రోగాలు కూడా నయం అవుతాయి. అందుకే ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు మందులను కనిపెడుతున్నారు. అయితే ఇప్పుడు మనం అలాంటి ఓ చెట్టు, వాటి విత్తనాల గురించి తెలుసుకుందాం. కానీ దీనితో నెయ్యి తయారు అవుతుంది అంటే మీరు నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే? ఇంతకీ ఆ చెట్టు ఏంటంటే?
సహజంగా నెయ్యి పాలతో తయారు అవుతుంది. కానీ ఉత్తరాఖండ్ చురా విత్తనాలతో నెయ్యిని తయారు చేయవచ్చట. ఈ రాష్ట్రంలో చ్యూరా బాగా పండుతుంది. పర్వతాలలో కనిపిస్తుంది ఈ చ్యూరా . దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనిని ఇండియన్ బట్టర్ ట్రీ లేదా గౌఫల్ అని కూడా పిలుస్తుంటారు. చురా పండ్లు తీపిగా, జ్యుసిగా ఉంటాయి. దీని విత్తనాల నుంచి నెయ్యి, నూనె తయారు చేస్తారు. దీని ఆకులను పశువుల మేతగా ఉపయోగిస్తారు. చ్యూరా కేక్ నుంచి పురుగుమందులు, సబ్బు, వాసెలిన్, కొవ్వొత్తులను కూడా తయారు చేస్తున్నారు. ఇక దీని శాస్త్రీయ నామం డిప్లోనెమా బుటిగేసియా.
ఉత్తరాఖండ్‌లో చురాను ఎక్కువగా పెంచుతారు. దీన్ని పెంచడం ద్వారా, పర్వత ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. దీని సాగు పర్వత ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. ఇక చురా చెట్లు ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఫలాలను ఇస్తాయట. ఇక దీని పండ్లు జూలై-ఆగస్టులో పండుతాయి. ఇది కూడా సీజనల్ ఫ్రూట్. చాలా అందమైన పర్వత వృక్షం కూడా. దీనిని పెంచడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. చురాను కామధేను అని కూడా అంటారు. ఇది పర్యావరణాన్ని పరిరక్షించడంలో చాలా సహాయపడుతుంది.
చ్యూరా పండు గింజలను వేయించి నెయ్యి తీస్తారు. దీని నెయ్యి ఆవు నెయ్యి లాగా రుచిగా ఉంటుంది. దీని నెయ్యి గౌట్ కు దివ్యౌషధం. బాగేశ్వర్‌లోని దేవకి మినీ గార్డెన్‌లో చురా చెట్లను ఉన్నాయి. కొత్త మొక్కలు కూడా వస్తున్నాయట. అంతేకాదు ఇది అనేక గృహ నివారణలలో కూడా ఉపయోగపడుతుంది. దీని పొట్టును దోమలను, పాములను తరిమికొట్టడానికి ఉపయోగిస్తారు. దీని పండ్ల నుంచి బెల్లం కూడా తయారు చేస్తారట. ఇక చ్యూరా పండ్లతో పరాఠాలు తయారు చేస్తారు. ఈ చెట్టు కలపను ఇంధనంగా ఉపయోగిస్తారు. చ్యూరా ఆకులను పశువుల దాణాగా ఉపయోగిస్తారు. దీని పువ్వుల నుంచి తేనె వస్తుంది. చ్యూరా ఆకులు, పండ్లు, కొమ్మలు, పువ్వులు, విత్తనాలు అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.