Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు
Health Tips: కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా తీర ప్రాంతాల్లో లభ్యమవుతాయి. వీటిలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తింటే మాత్రం ఇంకా ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదో ఈ స్టోరీలో చూద్దాం.

Health Tips : చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చాలా మందికి ఈ పచ్చి చేపలు కంటే ఎండు చేపలు అంటే ఇష్టం. వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పచ్చి చేపలు కంటే ఎండు చేపలు కాస్త ఖరీదు తక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా కొనుగోలు చేసి ఒక్కసారి వండుకుని తింటారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. దీంతో చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా తీర ప్రాంతాల్లో లభ్యమవుతాయి. వీటిలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తింటే మాత్రం ఇంకా ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
ఎండు చేపలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల చాలా మంది వీటిని తింటుంటారు. కొందరు వీటి వాసన నచ్చక తినరు. మరికొందరు వీటిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయని తింటారు. వీటిలో ఫాస్పరస్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే తల్లులకు పాల ఉత్పత్తిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఈ ఎండు చేపలు బాగా ఉపయోగపడతాయి. మూత్రాశయం, గర్భాశయ సంబంధిత వంటి సమస్యలు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా కూడా కొన్ని సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని నిపుణులు అంటున్నారు. సమస్యలు తగ్గించడానికి ఎండు చేపల సహాయపడతాయని అంటారు. అందుకే మహిళలు కూడా ఎండు చేపలను ఇష్టంగానే తింటారు. అయితే కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలి.
ఈ ఎండు చేపలను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ ఎండు చేపలను తినకూడదు. వారానికి ఒకసారి మాత్రమే వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యలతో పాటు మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఎండు చేపలు తినకూడదు. వీటితో పాటు చర్మ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా వీటిని తింటే దురద, అలెర్జీ, పొక్కులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటిని అతిగా తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Black Salt: నల్ల ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Exercises: ఆఫీస్ లో కూర్చొనే ఈ వ్యాయామాలు చేయండి.
-
First Ultra Sound : గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేయాలి?