Hot water : ఎక్కువ వేడి నీరు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Hot water :
వేడి నీరు తాగడం చాలా మంచిది అంటారు నిపుణులు. అందుకే నీటిని వేడి చేసుకొని తాగే వారు ఎక్కువ మందే ఉన్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగు అవుతుంది. బరువు తగ్గుతారు. శరీరం కూడా నిర్విషీకరణ అవుతుంది. అయితే మంచిది కదా అని ఓ తెగ వేడి వేడి నీరు తాగుతున్నారా? నిజమే కొందరు ఇలాగే గ్యాస్ మీద నుంచి తీసిన వెంటనే వేడి వేడి నీరును తాగుతారు. కనీసం వాటిని కాస్త చల్లారనివ్వాలి కదా. నో అసలు ఆగకుండా టీ, కాఫీలు తాగినట్టు ఓ తాగేస్తుంటారు. కానీ ఇలా తాగడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా? ఈ ఆర్టికల్ లో ఆ విషయం తెలుసుకుందాం..
మీరు అతిగా వేడి ఉన్న నీరు తాగితే, మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడటం ఖాయం. ఎందుకంటే ఈ వేడి నీరు కడుపులోని శ్లేష్మ పొరను దెబ్బతీస్తుంది. వేడి వేడి నీరు తాగితే… ఆమ్లత్వం, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. మూత్రపిండాల ప్రధాన విధి శరీరం నుంచి అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రాన్ని ఉత్పత్తి చేయడం. కానీ మీరు అవసరానికి మించి ఎక్కువ నీరు తాగితే, ముఖ్యంగా వేడి నీరు తాగితే, అది మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. సో మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది అన్నమాట.
ఎక్కువ వేడి నీరు తాగడం వల్ల రక్తపోటు అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది శరీరంలోని సోడియం, ఎలక్ట్రోలైట్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల బలహీనత, తలతిరుగుడు, అలసట వస్తుంది. నీరు చాలా వేడిగా ఉంటే, అది గొంతు, నోటి సున్నితమైన చర్మాన్ని కాల్చేస్తుంది. దీనివల్ల బొబ్బలు, గొంతులో వాపు, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు వేడి నీటిని తాగడం వల్ల గొంతు కణాలపై చెడు ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు వస్తాయి.
తరచుగా చెమట : చాలా వేడి నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల అధిక చెమట పడుతుంది. శరీరం అవసరానికి మించి చెమటలు పడితే, డీహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. మీకు గుండెల్లో మంట, ఆమ్లత్వం, గొంతులో వాపు లేదా నొప్పి, అధిక చెమట, తరచుగా మూత్రవిసర్జన, బలహీనత, అలసట, తలనొప్పి, రక్తపోటులో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తే, వేడి నీరు తాగడం కాస్త తగ్గించండి.
నీరు ఎంత వేడి ఉండాలి?
గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. అంతేకానీ ఓ వేడి వేడి నీరు తాగకండి.
ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు ఎక్కువ వేడి నీటిని అసలు తాగవద్దు.
రోజంతా గరిష్టంగా 8-10 గ్లాసుల నీరు తీసుకోవాలి. కానీ అతిగా వేడి నీరు మాత్రం తాగవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.