Health Tips: రాత్రి నిద్ర పోయే ముందు ఇది తాగుతున్నారా?

Health Tips:
మనసుల ఆరోగ్యానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవసరం. ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నిద్ర గడియారానికి భంగం కలిగితే అనేక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు కనీస నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాల వల్ల చాలామంది సరైన నిద్రపోవడం లేదు. అయితే ఒక్కసారి నిద్ర భంగం కలిగితే ఎప్పటికీ సమయానికి నిద్ర రాకుండా పోతుంది. దీంతో మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతారు. అయితే పడుకోగానే నిద్ర పట్టి ఎందుకు అంతకుముందు కొన్ని పనులు చేయాలి. అలా చేయడంవల్ల సరైన నిద్ర రావడంతో పాటు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
కొంతమంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. మరికొందరు రాత్రి భోజనం తర్వాత కాసేపు కాలక్షేపం చేసి నిద్రిస్తారు. అయితే తిన్న వెంటనే పడుకోవడం ద్వారా జీర్ణ క్రియ సక్రమంగా లేక సరైన నిద్ర రాకుండా ఉంటుంది. తిన్న ఆహారం డైజేషన్ కావడానికి నీరు తాగుతూ ఉంటారు. అయినా ఒక్కసారి కడుపు ఉబ్బరంగా ఉండి.. తిన్న ఆహారం జీర్ణం కాక సరైన నిద్ర పట్టదు. ఇలాంటి సమయంలో పడుకునే ముందు కొన్ని వేడి నీళ్లు తాగడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయి.
నిద్రపోయే ముందు వేడి నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ నీరు కంటే వేడి నీరు వల్ల శరీరంలోని ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. ఈ నీరు పడుకునే ముందు తాగడం వల్ల అప్పటికే తిన్న ఆహారం జీర్ణం కావడంతో సక్రమమైన నిద్ర వస్తుంది. అంతేకాకుండా వేడి నీరు తాగడం వల్ల పడుకున్న తర్వాత నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో మెదడులో ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటుంది.
కొంతమందికి తిన ఆహారం జీర్ణం అయినా.. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ సమస్య పోవాలంటే వేడి నీరు తాగి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం లేచేసరికి కడుపులో ఎలాంటి అలజడి ఉండదు. ఆ తర్వాత చేసే కార్యక్రమాలు అనుగుణంగా ఉంటాయి. అంతేకాకుండా పడుకున్న సమయంలో ఆహారం మొత్తం జీర్ణం కావడంతో ఉదయం ఉత్సాహంగా ఉంటారు. ఒకవేళ వ్యాయామం చేయాలని అనుకునే వారికి అప్పటికే శక్తి తయారవుతుంది.
అందువల్ల నిద్రపోయే ముందు కచ్చితంగా వేడి నీరు తాగే ప్రయత్నం చేయండి. అయితే నిద్రపోయే ముందు సాధ్యం కాకపోతే ఉదయం లేచిన తర్వాత కూడా వేడి నీరు తాగవచ్చును. ఇలా చేయడం వల్ల పిండి పదార్థాలుగా మారిన ఆహారం వెంటనే రక్తనాళాల్లోకి వెళ్తుంది. దీంతో రక్తప్రసరణ మెరుగ్గా మారుతుంది. అందువల్ల రాత్రి లేదా ఉదయం వేడి నీరు తాగే అలవాటు చేసుకోవాలి. వేడి నీరు తాగడం వల్ల కడుపులో ఉన్న మరణాలను కూడా తొలగిస్తుంది. అలాగే వేడి నీరు పరిశుభ్రంగా ఉండి ఇలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Black Salt: నల్ల ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Exercises: ఆఫీస్ లో కూర్చొనే ఈ వ్యాయామాలు చేయండి.
-
First Ultra Sound : గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేయాలి?
-
Health Tips : రోజుకు ఒకసారి అన్నం తింటే శరీరంలో ఈ మార్పులు పక్కా..