Hot Water: బాగా వేడి నీరు తాగుతున్నారా.. అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Hot Water:
వేడి నీరు ఆరోగ్యానికి మంచిదే. అనారోగ్య సమస్యలు ఉన్నవారు చల్లని నీరు రాకుండా వేడి నీటినే డైలీ తాగుతారు. వేడి నీటి వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే వేడి నీటిని కొందరు చల్లగా చేసి తాగుతారు. మరికొందరు బాగా వేడి చేసి మరి తాగుతుంటారు. వేడి నీరు తాగడం ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. వేడి నీటి వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే వేడి నీటి వల్ల పేగు సమస్యలు, మలబద్ధకం సమస్యలన్నింటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఊబకాయం సమస్యలు ఉన్న వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. డైలీ వేడి నీరు తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అయితే వేడి నీరు ఆరోగ్యానికి మంచిదే. కానీ బాగా వేడిగా ఉన్న నీరు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా వేడిగా ఉండే నీరు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బాగా వేడిగా ఉండే నీటిని తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
రక్తపోటు
ఎక్కువ వేడిగా ఉండే నీరు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. వేడి నీరు శరీరంలోని సోడియం, ఎలక్ట్రోలైట్ల స్థాయిలను బాగా ప్రభావితం చేస్తుంది. దీంతో బలహీనంగా మారడం, తల తిప్పడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. వేడిగా ఉండే నీటి వల్ల గుండెల్లో మంట కూడా వస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. వేడిగా ఉన్న నీటిని నోటిలో వేయడం వల్ల గొంతులో నొప్పి, వాపు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీరు కంటే గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచివి. అంతే కానీ బాగా వేడిగా ఉన్న నీరు ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రత పెరుగుతుంది
వేడిగా ఉన్న నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. దీనివల్ల చెమట ఎక్కువగా వస్తుంది. అలాగే బాడీ కూడా డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. గుండెల్లో మంట, ఆమ్లత్వం, గొంతులో వాపు, అధికంగా చెమట, బలహీనత, తలనొప్పి, అలసట, రక్తపోటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయాన్నే తాగితే..
వేడి నీరు కంటే గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు తాగితే మంచిది. రాత్రి పూట వేడి నీరు తాగితే ఉదయాన్నే మలవిసర్జన ఫ్రీగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి కాకుండా గోరు వెచ్చని నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య కూడా క్లియర్ అవుతుంది. అలాగే కడుపులో ఉన్న క్రిములు అన్ని బయటకు వెళ్లిపోతాయి. అయితే కాస్త గోరు వెచ్చగా ఉన్న నీటిని తాగితేనే ప్రయోజనాలు ఉంటాయి. లేకపోతే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.
-
Health Tips: వేడి నీరు V/S గోరు వెచ్చని నీరు. ఏది మంచిది?
-
Health Tips: రాత్రి నిద్ర పోయే ముందు ఇది తాగుతున్నారా?
-
Hot water : ఎక్కువ వేడి నీరు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?
-
Kharbuja seeds: వచ్చేసిన సమ్మర్.. ఈ గింజలు తీసుకుంటే ట్రిపుల్ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
-
High Blood Pressure: పిల్లలకు హై బీపీ సమస్య ఉందా? అయితే నిద్ర మస్ట్.