Kshama Bindu: దేశంలో మొదటి సోలోగామి ఈమెనే!

Kshama Bindu: ఈ మధ్య కాలంలో పురుషుల కంటే మహిళలు ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మారిన పరిస్థితుల వల్ల చాలా మంది ఇతర అబ్బాయిలను నమ్మలేక పెళ్లి చేసుకోవడం లేదు. అయితే కొందరు సేమ్ జెండర్‌ను పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు అమ్మాయిలు దేవుడిని పెళ్లి చేసుకుంటున్నారు. అయితే గుజరాత్‌లో ఓ అమ్మాయి మాత్రం ఏకంగా తనని తానే పెళ్లి చేసుకుంది. ఇలా తనని తాను పెళ్లి చేసుకున్న వారిని సోలోగామి అంటారు. అసలు ఎవరు ఆ యువతి, తనని తాను ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుజరాత్‌కి చెందిన క్షమా బిందు అనే యువతి తనని తానే పెళ్లి చేసుకుంది. అయితే ఇలా తనని తానే వివాహం చేసుకున్న మొదటి మహిళా దేశంలో క్షమా బిందునే. అయితే ఈమె తనకి తాను హిందూ ఆలయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ హిందూ మతం అనుమతించక పోవడంతో హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంట్లోనే ఆమె తనకు తాను వివాహం చేసుకుంది. ఇక్కడితే ఆగకుండా పెళ్లి తర్వాత ఒంటరిగానే హనీమూన్‌కి వెళ్లి ఎంజాయ్ చేసింది. అయితే ఆమె 2022 జూన్‌లో పెళ్లి చేసుకుంది. ఇప్పటికే రెండు వివాహ వార్షికోత్సవాలు కూడా జరుపుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో కూడా ప్రతీ ఏడాది పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసి నెటిజన్లు ఆమెకు విషెష్ కూడా తెలియజేస్తుంటారు. ఒంటరిగా ఉండటం కష్టం. అలాంటిది ఒంటరిగానే పెళ్లి చేసుకుని జీవితాన్ని గడుపుతోందని కామెంట్లు చేసేవారు.
ప్రస్తుతం రోజుల్లో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. చాలా మందికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఒంటరిగా ఉండటం లేదా వారినే వారు పెళ్లి చేసుకోవడం లేదా దేవుడిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా వారిని వారే పెళ్లి చేసుకోవడం వల్ల కొందరు వీరిని విమర్శిస్తు్ంటే.. మరికొందరు వీరిని సపోర్ట్ చేస్తున్నారు. సమాజం ఎటువైపు వెళ్లిపోతుందనని అంటున్నారు. మారిన అలవాట్ల వల్ల చాలా మంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఏడాది కాకుండానే విడిపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు.
-
UPSC సివిల్స్ రిజల్ట్స్.. టాప్ 10 ర్యాంకర్ల లిస్ట్ ఇదే
-
Marriage: ఇలాంటి వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోవద్దు. లేదంటే జీవితం నరకమే..
-
Srikanth Addala: ఆ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్.. నిజమేనా?
-
Zodaic Signs: పెళ్లి విషయంలో ఈ రాశుల వారు అదృష్టవంతులే
-
Relationship : పెళ్లి తర్వాత కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారా? సంసారం కూలి పోతుంది. జాగ్రత్త