Parenting Tips: పిల్లలు స్కూల్ కు వెళ్లమని ఎలాంటి సాకులు చెబుతున్నారా? మీ పిల్లలు కూడా అంతేనా?

Parenting Tips:
ప్రతి రోజు స్కూల్ కు వెళ్లాలంటే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. అందుకే ఎప్పుడు ఏదో ఒక సాకు చెబుతుంటారు. వారి సాకులు కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక కొందరు తల్లిదండ్రులు పోనీలే అని లైట్ తీసుకుంటే కొందరు మాత్రం అసలు విడిచిపెట్టారు. నిజంగా వారికి సమస్య ఉందా లేదా అని థింక్ చేసి వారిని స్కూల్ కు పంపుతారు. మరి రెగ్యూలర్ గా పిల్లలు చెప్పే సాకులు ఏంటో ఓ సారి చూసేద్దామా? మీ పిల్లలు కూడా ఇలాంటివే చెబుతుంటారా? కామెంట్స్ చేయండి.
1. కడుపు నొప్పి: పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా ఉండటానికి చాలా కామన్ గా చెప్పే సాకు ఇది. పిల్లలు తమ తల్లిదండ్రులను అమ్మా, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది అని చాలా సీరియస్‌గా చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇక స్కూల్ టైం అయిపోయింది అంటే చాలు ఆ నొప్పి ఏడికి పోతుందో అసలు అర్థం కాదు.
2. హోంవర్క్ చేయలేదు: నేను ఇవాల హోం వర్క్ చేయలేదు. ఇలానే వెళ్తే మా టీచర్ కొడుతుంది అమ్మ అంటూ ఫుల్ గా ఏడుస్తుంటారు. అయ్యో పోనీలే అని తల్లి లైట్ తీసుకుంటుంది. ఆ రేంజ్ లో నటిస్తారు.
3. ఈరోజు స్కూల్లో ప్రత్యేకంగా ఏమీ లేదు: ఈ రోజు క్లాస్ లు జరగవట మమ్మీ. లేదంటే ఈ రోజు టీచర్ రారంట మమ్మీ అని చెబుతారు. ఈ సాకు పిల్లలు పాఠశాల షెడ్యూల్‌ను అంచనా వేసి ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల వారి తెలివితేటలను చూపిస్తుంటారు.
4. అనారోగ్యం::”నాకు జ్వరంగా ఉంది” లేదా “నాకు గొంతు నొప్పిగా ఉంది” అనేవి పిల్లలు చాలా అమాయకత్వంతో చెప్పే సాకులు. తల్లిదండ్రులు థర్మామీటర్‌తో తనిఖీ చేసినప్పుడు, పిల్లల గురించి నిజం బయటకు వస్తుంది.
5. బూట్లు లేదా యూనిఫాంలు పాడైపోవడం: కొంతమంది పిల్లలు, “నా షూ పాడైంది” లేదా “నా యూనిఫాం మురికిగా ఉంది” అని అంటారు. ఈ సాకులు విన్న తర్వాత, పిల్లవాడు పాఠశాలకు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు.
6. పాఠశాలలో భయం: పిల్లలు “స్కూల్లో వాళ్లు నన్ను ఆటపట్టించారు” లేదా “టీచర్ నన్ను తిట్టారు” వంటి సాకులు కూడా చెబుతారు. ఈ సాకులు తరచుగా పిల్లల అమాయకత్వాన్ని, భయాన్ని కూడా చూపుతాయి.
7. వర్షం లేదా వాతావరణం: “ఈరోజు చాలా గట్టిగా వర్షం పడుతోంది. లేదా “చాలా చలిగా ఉంది, నేను స్కూల్ కి ఎలా వెళ్ళాలి?” ఎండ ఉంది కదా? అంటూ వాతావరణ సంబంధిత సాకులు చాలా తెలివిగా చెబుతారు.
8. కుటుంబ అత్యవసర సాకు: మన ఇంటికి ఇవాల చుట్టాలు వస్తున్నారు. లేదా మనం అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్దాం అని ఏడుస్తారు. కావాలని స్కూల్ నుంచి డైవర్ట్ చేయిస్తారు. భలే టాలెంట్ కదా.
తల్లిదండ్రుల బాధ్యత: పిల్లల ఈ హాస్యాస్పదమైన సాకులు కొంతవరకు వినోదాన్ని ఇస్తాయి. కానీ పాఠశాల ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగే, పిల్లల సాకులు వారి చదువులకు ఆటంకం కలిగించకుండా చూసుకోండి. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఉండటానికి చెప్పే ఈ సాకులు వింటే నవ్వుకోవడం సహజం. కానీ ఈ సాకుల వెనుక వారి అమాయకత్వం, పాఠశాలకు వెళ్లకుండా ఉండాలనే సృజనాత్మక ఆలోచన దాగి ఉంటుంది. తల్లిదండ్రులు ఈ సాకులను గమనించి, తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలి.
-
Parenting Tips: పిల్లలకు నిద్రపోయే ముందు ఈ విషయాలు చెబుతున్నారా?
-
Parenting Tips: పిల్లలను దూరం చేసే పేరెంట్స్ అలవాట్లు.. మీకు కూడా ఉన్నాయా? అయితే త్వరలో మీ పిల్లలకు దూరం కాబోతున్నారు..
-
Parenting Tips: పిల్లల వద్ద ఈ అబద్దాలు చెబుతున్నారా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే..
-
Parenting Tips: మీ పిల్లలు మీకు దూరం అవడానికి ఇదే కారణం
-
Parenting Tips: మీ పిల్లలకు బోర్డ్ ఎక్సామ్స్ దగ్గరకు వస్తున్నాయా? పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.