Parenting Tips: పిల్లలకు నిద్రపోయే ముందు ఈ విషయాలు చెబుతున్నారా?
Parenting Tips పిల్లలు నిద్రపోయే ముందు వారికి కొన్ని మంచి విషయాలను మాత్రమే చెప్పాలి. ఎక్కువగా పాజిటివ్ విషయాలను చెప్పాలి. అప్పుడే వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోతారు. లేకపోతే వారి నిద్రకు భంగం కలుగుతుంది.

Parenting Tips: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో పేరెంట్స్ పిల్లలను పెద్దగా పట్టించుకోవడం లేదు. డబ్బుల కోసం పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రోజంతా పోని వర్క్ బిజీలో ఉన్నా రాత్రి సమయాల్లో కనీసం పిల్లలతో ఉండరు. రాత్రిపూట అయిన వారితో కొంత సమయం గడిపితేనే పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది వారానికి ఒకసారి పిల్లలతో సమయం గడుపుతున్నారు. అది కూడా కొందరు చేయరు. సెలవు దొరికితే చాలు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలను చూసుకోవాలి. ఇలా పిల్లలను ఒంటరిగా వదిలేస్తే.. వారు ఇతరులతో సరిగ్గా కలవలేరు. ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చోని బాధపడుతుంటారు. అయితే పిల్లలకు నిద్రపోయే ముందు కొన్ని విషయాలను తల్లిదండ్రులు చెప్పాలి. అప్పుడే వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
పిల్లలు నిద్రపోయే ముందు వారికి కొన్ని మంచి విషయాలను మాత్రమే చెప్పాలి. ఎక్కువగా పాజిటివ్ విషయాలను చెప్పాలి. అప్పుడే వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోతారు. లేకపోతే వారి నిద్రకు భంగం కలుగుతుంది. పిల్లలు అన్న తర్వాత అల్లరి తప్పకుండా చేస్తారు. వారు చేసిన అల్లరి, తప్పుల గురించి పిల్లలతో ఆ రాత్రి సమయాల్లో మాట్లాడకూడదు. వారికి మంచి కథలు, విషయాలు చెప్పి పడుకోబెట్టాలి. దీనివల్ల వారు హ్యాపీగా నిద్రపోతారు. వీరికి ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రావు. లేకపోతే మీరు ఏవైనా నెగిటివ్‌గా చెబితే మాత్రం వారికి అదే ఆందోళన ఉంటుంది. రాత్రి పూట పూర్తిగా నిద్ర కూడా పట్టదు. నెగిటివ్‌గా ఆలోచించి సమస్యలను తెచ్చుకుంటారు. తర్వాత రోజు కూడా నెగిటివ్ ఆలోచనలతో నిద్రలేస్తారు. దీనివల్ల రోజంతా చిరాకు ఉంటుంది. డైలీ ఇలానే జరిగితే వారి మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి పిల్లలకు రాత్రిపూట మంచి కథలు, విషయాలు చెప్పి నిద్రపెట్టండి.
కొందరు పిల్లలకు నిద్ర రాకపోయినా తల్లిదండ్రులు పడుకోని చెబుతారు. దీంతో వారు ఏడుస్తారు. పిల్లలు ఏడుస్తున్నా కూడా వారిని పడుకో పెట్టవద్దు. ఇలా వారు నిద్రపోతే వారికి అంతా కూడా నెగిటివ్‌గానే అనిపిస్తుంది. సరిగ్గా నిద్ర కూడా పోలేరు. అలాగే కొందరు తల్లిదండ్రులు వారిని ఇతరులతో పోల్చి చెబుతారు. వాళ్లలా ఉండు, ఇలా ఉండు అని అంటుంటారు. అయితే పిల్లలు నిద్రపోయే ముందు ఇలాంటివి చెబితే వారు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు. అలాగే వారు నిద్రపోవాలని తప్పుడు ప్రామిస్‌లు అయితే అసలు చేయవద్దు. వీటివల్ల వారు వాటి మీద హోప్స్ పెట్టుకుంటారు. తర్వాత మీరు వాటిని తీర్చలేకపోతే పిల్లలు బాధపడతారు. కాబట్టి నిద్రపోయే ముందు పిల్లలకు తప్పుడు ప్రామిస్‌లు అయితే అసలు చేయవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Parenting: కూతురికి తప్పకుండా నేర్పించాల్సినవి ఇవే!
-
Parenting Tips: పిల్లలను దూరం చేసే పేరెంట్స్ అలవాట్లు.. మీకు కూడా ఉన్నాయా? అయితే త్వరలో మీ పిల్లలకు దూరం కాబోతున్నారు..
-
Parenting Tips: పిల్లలు స్కూల్ కు వెళ్లమని ఎలాంటి సాకులు చెబుతున్నారా? మీ పిల్లలు కూడా అంతేనా?
-
Parenting Tips: పిల్లల వద్ద ఈ అబద్దాలు చెబుతున్నారా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే..
-
Parenting Tips: మీ పిల్లలు మీకు దూరం అవడానికి ఇదే కారణం
-
Parenting Tips: మీ పిల్లలకు బోర్డ్ ఎక్సామ్స్ దగ్గరకు వస్తున్నాయా? పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.