Parenting Tips: మీ పిల్లలు మీకు దూరం అవడానికి ఇదే కారణం

Parenting Tips:
ప్రస్తుత యుగంలో పిల్లలను పెంచడం పెద్ద కష్టమైన పని. ఈ కంప్యూటర్ జనరేషన్ పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా అర్థం కావడం లేదు. సో తల్లిదండ్రులు ప్రతి విషయంలో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. బాధ్యత మస్ట్. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును మెరుగ్గా చేయాల్సిందే. వారి లైఫ్ బాగుండటానికి శాయశక్తులా ప్రయత్నించాల్సిందే. తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతిగా భావిస్తుంటారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలు అవుతుంది. ఎందుకంటే పిల్లల బాధ్యతలను నెరవేర్చడం, వారిని జాగ్రత్తగా చూసుకోవడం అంత ఈజీ కాదు.
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, పెంపకం కూడా చాలా మారిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు, అనేక ఇతర సమస్యలు వారికి ఇబ్బందిగా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించడానికి, తల్లిదండ్రులు డబ్బు సంపాదించడానికి పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు. వారికి పాఠశాల విద్య, మంచి బట్టలు, ఖరీదైన బహుమతులు కూడా అందిస్తున్నారు. వీటి కోసం డబ్బు కావాలి సో కష్టపడాలి. సో నో టైమ్ కదా. అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ, చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటారు. మరి మీ పిల్లలు మీ నుంచి దూరంగా ఉండటానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందామా?
పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదని చాలా మంది బాధ పడుతున్నారు. దీంతో వారి మధ్య తరచుగా గొడవలు అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఒప్పందం లేకపోవడం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని కాదంటారు. వినరు. లేదా అంగీకరించరు. దీంతో వారి పిల్లలు కూడా వారితో అదే విధంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. కాబట్టి, పరిస్థితిని మెరుగుపరచడానికి, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుని మాట్లాడాలి.
ఈ రోజుల్లో, తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లల సౌకర్యం, శ్రేయస్సును కాపాడుకోవడానికి నిరంతరం పనిలోనే ఉంటున్నారు. దీని కారణంగా, వారికి పని ఒత్తిడి మొదలవుతుంది. పగలు, రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల, తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీని కారణంగా, పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరుగుతుంది .
తరచుగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతుంటారు. చదువు అయినా, క్రీడలైనా, ప్రతి చిన్న విషయానికి మీ పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులలో న్యూనతా భావన ఏర్పడుతుంది. దీని కారణంగా, పిల్లలు తల్లిదండ్రులపై కోపం పెంచుకుంటారు. మీకు దూరంగా ఉంటూనే మిమ్మల్ని ద్వేషిస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Parenting Tips: పిల్లలకు నిద్రపోయే ముందు ఈ విషయాలు చెబుతున్నారా?
-
Child Care Tips: బిడ్డకు తల్లిపాలు సరిగ్గా ఇవ్వడం లేదా?
-
Parenting Tips: పిల్లలను దూరం చేసే పేరెంట్స్ అలవాట్లు.. మీకు కూడా ఉన్నాయా? అయితే త్వరలో మీ పిల్లలకు దూరం కాబోతున్నారు..
-
Parenting Tips: పిల్లలు స్కూల్ కు వెళ్లమని ఎలాంటి సాకులు చెబుతున్నారా? మీ పిల్లలు కూడా అంతేనా?
-
Parenting Tips: పిల్లల వద్ద ఈ అబద్దాలు చెబుతున్నారా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే..
-
Parenting Tips: మీ పిల్లలకు బోర్డ్ ఎక్సామ్స్ దగ్గరకు వస్తున్నాయా? పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.