Parenting Tips: మీ పిల్లలకు బోర్డ్ ఎక్సామ్స్ దగ్గరకు వస్తున్నాయా? పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Parenting Tips: పిల్లలకు బోర్డ్ ఎక్సామ్స్ త్వరలో జరగనున్నాయి. పదవ, పన్నెండు, డిగ్రీ వారికి కూడా పరీక్షలు జరుగుతాయి. ఇక వీరికి మాత్రమే కాదు LKG నుంచి 9వ తరగతి పిల్లలకు కూడా అదే తరహాలో పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే మరో తరగతికి వెళ్లడానికి ఇదే కదా ఫైనల్ ఎగ్జామ్. మరి మీ పిల్లలు ఈ పరీక్షలు రాస్తుంటే చాలా టెన్షన్ పడతారు తెలుసా? అవును నిజమే ఈ పరీక్షలు రాయడానికి చాలా టెన్షన్ అవుతుందట. చివరి పరీక్షలు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటంటే? ప్రధాని మోదీ పరీక్షలపై చర్చ కార్యక్రమంలో నిపుణులు, తల్లిదండ్రులు పిల్లలకు పరీక్షల ముందు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలిపారు. ఆ ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు చాలా చురుకుగా ఉంటారట. ఇంతకీ ఆ ఆహారం ఏంటంటే?
చిరుధాన్యాలు: అయితే పిల్లలకు చక్కెర కోరికలు ఉంటాయట. అందుకే దీన్ని నివారించాలంటే వారికి ఫుడ్ లో చిరు ధాన్యాలు యాడ్ చేయాలి. అంతేకాదు కుదిరితే బ్రౌన్ రైస్ ను కూడా ఇవ్వండి. దీని వల్ల పిల్లలకు చక్కెర కోరికలు తగ్గుతాయి అంటున్నారు పోషకాహార నిపుణురాలు షోనాలి.
ఒత్తిడికి ఆహారం: పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి అవుతుంటారు పిల్లలు. ఇది కామన్ గా జరుగుతుంటుంది.అయితే కొన్ని ఆహారాలు సహజ ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే పిల్లలకు ఒత్తిడి తగ్గించాలంటే వారికి వేరుశనగ, అరటి పండు, బియ్యం వంటివి తినిపించాలి అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఆ ఎనర్జీ డ్రింక్స్ ను మాత్రం ఇవ్వకండి. అవసరం అయితే మీరు ఇంట్లో మంచి జ్యూస్ లు తయారు చేసి ఇవ్వండి.
జంక్ ఫుడ్: చాలా మంది పిల్లలకు ప్రస్తుతం జంక్ ఫుడ్ తినడం అలవాటుగా మారింది. దీన్ని తినడం అసలు వదలడం లేదు. బయట ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వీటి వల్ల వారి ఆరోగ్యం మీద చెడు ప్రభావం ఉంటుంది. అందుకే వారికి మొలకలు వంటివి ఇవ్వండి. వాటి ప్రయోజనాలు తెలియజేయండి. కానీ జంక్ ఫుడ్ జోలికి వెళ్లవద్దని గట్టిగా చెప్పాల్సిందే.
జీర్ణక్రియ ఆరోగ్యం: ఇక ఒత్తడితో జీర్ణ సమస్యలు కూడా ఎదుర్కుంటారు పిల్లలు. మీ పిల్లలు కూడా ఈ సమస్యతో బాధ పడితే వారికి అరటి పండు లేదా పెరుగు అన్నం ఇవ్వండి అంటున్నారు పోషకాహార నిపుణురాలు రజుతా దివేకర్. ఇక నీరు మాత్రం క్రమం తప్పకుండా తీసుకోవాలి. చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా ముఖ్యం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Parenting Tips: పిల్లలకు నిద్రపోయే ముందు ఈ విషయాలు చెబుతున్నారా?
-
Child Care Tips: బిడ్డకు తల్లిపాలు సరిగ్గా ఇవ్వడం లేదా?
-
Parenting Tips: పిల్లలను దూరం చేసే పేరెంట్స్ అలవాట్లు.. మీకు కూడా ఉన్నాయా? అయితే త్వరలో మీ పిల్లలకు దూరం కాబోతున్నారు..
-
Parenting Tips: పిల్లలు స్కూల్ కు వెళ్లమని ఎలాంటి సాకులు చెబుతున్నారా? మీ పిల్లలు కూడా అంతేనా?
-
Parenting Tips: పిల్లల వద్ద ఈ అబద్దాలు చెబుతున్నారా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే..
-
Parenting Tips: మీ పిల్లలు మీకు దూరం అవడానికి ఇదే కారణం