Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కావాల్సిన విటమిన్.. తక్కువైతే ప్రాణాలకే ప్రమాదం

Pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పోషకాలు ఉండే ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మంది బద్దకంగా తయారు అవుతున్నారు. దీంతో పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకుండా విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. గర్భిణులకు సూర్యకాంతి కూడా చాలా ముఖ్యమైనది. సూర్యకాంతి నుంచి విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ గర్భిణులకు చాలా ముఖ్యమైనది. ఒకవేళ లోపం వస్తే మాత్రం గర్భిణుల ప్రాణాలకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులకు విటమిన్ డి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డి ఉంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ లోపం వల్ల పుట్టిన పిల్లలకు ఆస్తమా, రికెట్స్ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు రక్తంలో విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉండాలి. లేకపోతే ప్రీక్లంప్సియా, మధుమేహం, ముందుగా డెలివరీ, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సూర్య కాంతి నుంచి విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ డి అందడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. డైలీ ఉదయం ఒక పది నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండే బాడీకి విటమిన్ డి అందుతుంది. ఈ విటమిన్ డి వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు.
గర్భిణిగా ఉన్న సమయంలో పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. పాలు, గుడ్లు, మాంసం వంటివి తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని పోషకాలు గర్భిణులకు బలాన్ని ఇస్తాయి. వీటితో డ్రైఫూట్స్, క్యారెట్, బీట్‌రూట్, పండ్లు వంటివి తీసుకోవాలి. వీటితో పాటు పండ్ల రసాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని పోషకాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే చాలా మంది ఈ రోజుల్లో పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవడం లేదు. మసాలా, కారం, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండటం లేదు. వీటిని తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో తాజా పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవడంతో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని మాత్రమే తీసుకోండి. వీటివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Khaleja Re-release : ఖలేజా సినిమాకు పాముతో వచ్చిన మహేష్ ఫ్యాన్.. ఓర్నీ ఇంత సాహసం అవసరమా ?
-
Zodiac Signs: శని ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
-
Lawcet: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్
-
Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
-
Sreeleela: ఎంగేజ్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన శ్రీ లీల
-
Miss World: మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
-
Tulsi Benefits : జుట్టు రాలడం తగ్గి..నిగనిగలాడే జుట్టు కావాలంటే తులసితో ఈ టిప్స్ పాటించండి