Sugar Cane Juice: వేసవిలో ఈ రసం ఎక్కువగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Sugar Cane Juice:
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా మంది జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు, కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. వీటిని తాగడం వల్ల ఎండ తీవ్రత నుంచి కాస్త విముక్తి ఉంటుందని భావిస్తారు. కొందరు వీటితో పాటు ఫ్రెష్ చెరకు రసం తాగుతుంటారు. దీనిని సమ్మర్‌లో తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుందని తాగుతుంటారు. ఇందులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. దీంతో చాలా మంది వేసవిలో ఈ చెరకు రసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యానికి మంచిదని రోజులో ప్రతీ పూట చెరకు రసం తాగుతారు. అయితే ఎంత ఆరోగ్యానికి మంచిదైనా కూడా మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అంత కంటే ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చెరకు రసం ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలేంటి? రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చెరకు రసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ అధికంగా తీసుకుంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ఇందులో కేలరీలు, చక్కెరలు రెండు ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. అలాగే చెరకు రసంలో పోలికోసనాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కొన్ని సార్లు ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఎక్కువగా చెరకు రసం తీసుకోవద్దు. రోజులో చెరకు రసాన్ని ఒక గ్లాసు వరకు మాత్రమే తాగాలి. అంతకంటే ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంత మంచి అయినా కూడా లిమిట్‌లో మాత్రమే తీసుకోండి. అప్పుడే మీకు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అతిగా తాగితే మధుమేహం, గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చెరకులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేసవిలో చర్మం ఎక్కువ ట్యాన్‌గా మారుతుంది. చెరకు రసం తాగడం వల్ల ఫేస్ క్లియర్‌గా మారుతుంది. దీంతో మీరు యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అలాగే కాలేయ సమస్యలు, మలబద్ధకం సమస్యలను కూడా చెరకు రసం తగ్గిస్తుంది. కాబట్టి రోజులో లిమిట్‌గా కేవలం ఒక గ్లాసు వరకు మాత్రమే తీసుకోండి. అప్పుడే మీకు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఎండ తీవ్రత నుంచి విముక్తి పొందడానికి ఎక్కువగా చెరకు రసం తాగుతుంటారు. బయటకు వెళ్లేటప్పుడు వీటికి కాస్త దూరంగా ఉండండి. బయట రసాయనాలు కలుపుతుంటారు. ఆ నిమిషానికి చల్లగా అనిపించి దాహం తీరినా కూడా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.