Smell Weight Loss: స్మెల్ చూసి బరువు తగ్గవచ్చు.. ఎలాగో ఆర్టికల్‌పై లుక్కేయండి

Smell Weight Loss: బరువు తగ్గడం కోసం చాలామంది జిమ్‌కు వెళ్లి గంటల తరబడి శ్రమిస్తారు. కఠినమైన డైట్‌లు పాటిస్తుంటారు. అలాగే ఎన్నో రకాల సప్లిమెంట్లు వాడటం వంటివి కూడా చేస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి ఇవన్నీ చేయక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒకే ఒక ట్రిక్ పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. దీనికి పెద్ద పని ఏం చేయక్కర్లేదు. ఫుడ్ తినే ముందు ఒక ట్రిక్‌ను గుర్తు పెట్టుకుంటే చాలు. మరి అది ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
తినడానికి ముందు ఆహారాన్ని వాసన చూస్తే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మనం అతిగా తినకుండా ఉంటామని నిపుణులు గుర్తించారు. ఈ పరిశోధనను జర్మన్ శాస్త్రవేత్తలు ఎలుకలపై నిర్వహించారు. ఎలుకలు ఆహార వాసనకు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి వారు వాటి మెదడులను స్కాన్ చేశారు. ఎలుకల మెదడులో ముక్కుతో నేరుగా సంబంధం ఉన్న కొన్ని ప్రత్యేకమైన నరాల కణాలను గుర్తించారు. భోజనానికి ముందు ఈ కణాలు చురుకుగా మారినప్పుడు, ఎలుకలు తక్కువ ఆహారం తిన్నాయని వారు కనుగొన్నారు. అయితే ఇది ఆహార వాసన అనేది కేవలం పీల్చినప్పుడు మాత్రమే జరిగింది. అంటే తినడానికి ముందు ఆహారాన్ని వాసన చూడటం వల్ల ఆకలి తగ్గి తక్కువ తింటారు. దీంతో బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
ఆహారాన్ని వాసన చూడటం ద్వారా ఆకలిని అదుపు చేసే ఈ ప్రక్రియ మనుషులపై కూడా పనిచేస్తుందా లేదా అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. మన మెదడులో కూడా ఎలుకలలో ఉన్నటు వంటి నరాల కణాల సమూహం ఉంది. ఇవి కూడా ఇలానే స్పందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పద్ధతి ఇప్పటికే అధిక బరువు ఉన్నవారికి తగ్గడానికి ఉపయోగపడదని అంటున్నారు. ఎందుకంటే ఊబకాయం ఉన్న ఎలుకలలో ఆహార వాసనకు మెదడు ప్రతిస్పందన ఒకేలా ఉండదని పరిశోధనల్లో తేలింది. దీనికి భిన్నంగా, సన్నగా ఉన్న ఎలుకలకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఊబకాయం వల్ల వాసన చూసే సామర్థ్యం తగ్గుతుందని అంటున్నారు. అయితే ఆహార వాసన కేవలం బరువు మాత్రమే కాదని మన రోజువారీ ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ పద్ధతి సన్నగా ఉన్న ఎలుకలలో ఆకలిని తగ్గిస్తుంది. కానీ ఊబకాయం ఉన్న ఎలుకలలో కాదని అంటున్నారు. గతంలో కూడా అనేక పరిశోధనలు తినడానికి ముందు కొన్ని వాసనలు పసిగట్టడం వల్ల ఆకలి తగ్గుతుందని తేలింది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?
-
Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!
-
Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!
-
Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?