Sugar: షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజమెంత?

Sugar:
ఏదో విధంగా పంచదారను డైలీ లిమిట్‌లో తీసుకుంటారు. తీపి వస్తువులు, స్వీట్లు ఇలా ఏదో విధంగా ఎప్పుడో ఒకసారి తింటారు. సాధారణంగా చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయినా కూడా ఎక్కువగా కొందరు ఎక్కువగా చక్కెర పదార్థాలను తింటుంటారు. చక్కెర తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చక్కెరను లిమిట్‌లో కాకుండా ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని కొందరు అంటున్నారు. అయితే చక్కెర వల్ల నిజంగానే క్యాన్సర్ వస్తుందా? రాదా? అనే విషయాలు తెలుసుకుందాం.
చక్కెర తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువ ప్రభావం కనిపించదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ వంటి గ్రోత్ ఫ్యాక్టర్ (IGF) విడుదల పెరుగుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను పెంచుతుంది. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు అయినా పురుషులు అయినా కూడా రోజుకి ఎక్కువ మోతాదులో పంచదార తీసుకోకూడదు. ఆరు టీ స్పూన్ల కంటే ఎక్కువ అసలు తీసుకోకూడదు. అంటే 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెరలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి శరీర ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఎక్కువగా చక్కెర తీసుకోవద్దు. దీనికి బదులు బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
చాలా మంది ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్లు ఇలా ఏదో విధంగా చక్కెరను అధికంగా తీసుకుంటారు. రోజూ కాకపోయినా వారానికి ఒకసారి అయినా వీటిని తప్పకుండా తింటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు బారిన పడతారు. ముఖ్యంగా ఊబకాయం సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు తేనె వంటి వాటిని చక్కెరగా వాడవచ్చు. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తాయి. తొందరగా ముసలితనం వస్తుంది. అలాగే చర్మంపై మొటిమలు మచ్చలు వంటివి వస్తాయి. చక్కెరను తక్కువగా కాదు.. అసలు తీసుకోకపోవడమే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Cancer: పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
-
Cancer: సన్ స్క్రీన్ క్యాన్సర్ ను తెస్తుందా? క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా?
-
Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే మీరే సులభంగా గుర్తించవచ్చు? ఎలాగంటే?
-
Cancer fruit : క్యాన్సర్ ను తరిమి కొట్టే పండు.. ఒక్కటి తింటే చాలు.. ఇంతకీ ఏం పండు అంటే?
-
Kitchen : మీ వంటింట్లో ఇవి ఉన్నాయా? అయితే కచ్చితంగా మీకు క్యాన్సర్ వస్తుంది.