Collagen Thread Treatment :యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ తీసుకోండి

Collagen Thread Treatment : అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడే కొల్లాజెన్‌ను పెంచడానికి కూడా మార్కెట్‌లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోటీన్ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ లోపం వల్ల మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. దీని వల్ల చర్మం కాంతి తగ్గిపోవడంతో పాటు వయసు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్‌లో కొల్లాజెన్ సప్లిమెంట్లు అందుబాటులో ఉండగా, కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ కూడా చేస్తున్నారు. .
కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్, ఇది చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది లేదా ఇతర కారణాల వల్ల కూడా వయస్సు కంటే ముందే కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది. దీని కోసం కొందరు కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. కాబట్టి, కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ అంటే ఏమిటి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
Read ALso : NTR : ‘వార్ 2’ మాత్రమే కాదు.. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్
కొల్లాజెన్ థ్రెడ్స్ అంటే ఏమిటి?
కొల్లాజెన్ థ్రెడ్స్ అనేది చర్మాన్ని పైకి లేపడానికి, బిగుతుగా చేయడానికి రూపొందించిన ఒక నాన్-సర్జికల్ కాస్మెటిక్ ప్రక్రియ. ఇవి సన్నని, కరిగిపోయే దారాలు. వీటిని యాంటీ ఏజింగ్ సంకేతాలను తగ్గించడానికి సిరంజి సహాయంతో చర్మం లోపలికి చొప్పిస్తారు. ఇవి బయోకాంపాటబుల్ పదార్థాలతో తయారు చేరరనయి. అంటే, ఇవి శరీరం లోపలికి వెళ్ళినప్పుడు నెమ్మదిగా కరిగిపోతాయి. ఈ ప్రక్రియ ద్వారా చర్మంలో కొత్త కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని రిపేర్ చేస్తుంది. మెరిసేలా చేస్తుంది.
కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ ఎవరు చేయించుకోవచ్చు?
కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్‌ను 30 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల మహిళలు చేయించుకోవచ్చు. అయితే, 30 సంవత్సరాల వయస్సులో మీ చర్మం ఆరోగ్యంగా ఉండి, తేలికపాటి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తే, ట్రీట్‌మెంట్ కంటే ఆహారాన్ని మెరుగుపరచడం, చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. దీని వల్ల ఫైన్ లైన్స్, ముడతలను నివారించవచ్చు.
కొల్లాజెన్ థ్రెడ్స్ ప్రయోజనాలు:
* నాన్ సర్జికల్ ఫేస్‌లిఫ్ట్: కొల్లాజెన్ థ్రెడ్స్ ఒక నాన్ సర్జికల్ ఫేస్‌లిఫ్ట్ ట్రీట్‌మెంట్. దీని ద్వారా నిపుణులు వదులుగా ఉన్న చర్మాన్ని సమర్థవంతంగా బిగుతుగా చేస్తారు.ఇది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
* చర్మాన్ని రిపేర్ చేస్తుంది: కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ తీసుకున్న రోగులకు కొన్ని రోజుల పాటు ముఖంపై ఎరుపుదనం లేదా వాపు సమస్య ఉండవచ్చు. కానీ ఇది ఒక వారంలో తగ్గిపోతుంది. చర్మం నెమ్మదిగా రిపేర్ అవ్వడం మొదలవుతుంది.
* తక్షణ ఫలితం: ఈ ప్రక్రియ చేయించుకున్న కొన్ని రోజుల తర్వాత మీకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. మీ చర్మం మృదువుగా, నునుపుగా మారుతుంది.
Read ALso :Bhairavam Trailer: వచ్చేసిన ‘భైరవం’ ట్రైలర్.. లాస్ట్‌లో ఈ షార్ట్ మాత్రం అదుర్స్
* సహజమైన మెరుపు: ఈ ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత మీ చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. మీ యాంటీ ఏజింగ్ సంకేతాలు, ముడతలు, మచ్చలు తగ్గుతాయి.
జాగ్రత్తలు తీసుకోవాలి
కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్‌ను మంచి నిపుణుల ద్వారా మాత్రమే చేయించుకోవాలి. ఎందుకంటే మీకు ఎలాంటి ఫలితం వస్తుందనేది ట్రీట్‌మెంట్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి థ్రెడ్ లిఫ్ట్ చేయించుకున్న తర్వాత చర్మ సంరక్షణ కోసం అదనపు వైద్య పర్యవేక్షణ అవసరం కావచ్చు. కాబట్టి, చర్మంపై ఏదైనా సమస్య కనిపించిన వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. ఈ ట్రీట్‌మెంట్ ప్రభావం 1 నుంచి 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది.