Coronavirus : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

Coronavirus : దేశంలో మరోసారి కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం (Central Government) సమీక్షించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. జూన్ 2, 3 తేదీలలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) డా. సునీతా శర్మ (Dr. Sunita Sharma) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC), ICMR, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశంలో కరోనా ప్రస్తుత పరిస్థితి
జూన్ 4, 2025 నాటికి.. దేశంలో మొత్తం 4,302 క్రియాశీల కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 864 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటివరకు మొత్తం 44 మరణాలు నమోదయ్యాయి. అయితే మరణించిన వారిలో ఎక్కువ మందికి ఇప్పటికే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. నమోదైన కేసులలో ఎక్కువ భాగం తేలికపాటివి, రోగులు హోమ్ ఐసోలేషన్ లోనే కోలుకుంటున్నారు.
Read Also:Astrology Remedies: భార్యలు మీరు ఇలా చేస్తే.. మీ భర్తే ఇక కోటీశ్వరుడు
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ (Oxygen), ఐసోలేషన్ బెడ్స్ (Isolation Beds), వెంటిలేటర్లు (Ventilators), అవసరమైన మందులు (Essential Medicines) తగినంత అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీని కోసం జూన్ 2న ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలపై మాక్ డ్రిల్ (Mock Drill) కూడా నిర్వహించారు. అంతేకాకుండా, జూన్ 4, 5 తేదీలలో ఆసుపత్రి స్థాయిలోనూ మాక్ డ్రిల్‌లను ప్లాన్ చేశారు. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవచ్చు.
రాష్ట్ర, జిల్లా స్థాయి నిఘా యూనిట్లు కేసులపై నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. అన్ని SARI కేసులకు, 5శాతం ILI కేసులకు టెస్టింగ్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, పాజిటివ్ వచ్చిన SARI నమూనాలను వైరస్ వేరియంట్లపై నిఘా ఉంచడానికి ICMR ల్యాబ్‌లకు హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నారు.
Read Also:Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది:
చేతుల పరిశుభ్రత: చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.
మాస్క్ ధరించడం: దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలి.
రద్దీ ప్రాంతాలకు దూరం: అనారోగ్యంగా ఉన్నప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి.
డాక్టర్‌ను సంప్రదించండి: ఎవరికైనా జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.