Railway station: ఇండియాలో చివరి రైల్వే స్టేషన్ ఇదే! దేశంలో సురక్షితమైన ప్రయాణం కోసం చాలా మం
దేశంలో సురక్షితమైన ప్రయాణం కోసం చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. తక్కువ లేదా ఎక్కువ దూరం అయినా ప్రయాణించాలంటే మాత్రం ఎక్కువగా రైలుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మిగతా వాటిలో ఖరీదు కూడా ఉంటుంది.

Railway station: దేశంలో సురక్షితమైన ప్రయాణం కోసం చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. తక్కువ లేదా ఎక్కువ దూరం అయినా ప్రయాణించాలంటే మాత్రం ఎక్కువగా రైలుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మిగతా వాటిలో ఖరీదు కూడా ఉంటుంది. దీంతో చాలా మంది తక్కువ ఖర్చుతో అయిపోతుందని రైలు ప్రయాణం ఎంచుకుంటారు. అయితే దేశంలో రైలు నెట్‌వర్క్ ఎక్కువగా ఉంది. రోజుకి దాదాపుగా 13,000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తాయి. అలాగే 25 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే దేశానికి స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అలాగే మన దేశంలో చిట్ట చివరి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ స్టేషన్ నుంచి ఎన్నో రైళ్లు కూడా వెళ్తుంటాయి. అయితే మనలో చాలా మందికి ఈ చిట్టచివరి రైల్వే స్టేషన్ గురించి పెద్దగా తెలియదు. ఈ రైల్వే స్టేషన్ దేశానికి చివరిలో ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఈ రైల్వే స్టేషన్ గురించి తెలియదు. దేశానికి చిట్ట చివరి రైల్వే స్టేషన్ చూడాలని, ఎక్కడ ఉందో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. మరి దేశంలో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో ఈ స్టోరీలో చూద్దాం.
Read also: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న సింఘాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే చివరిది. ఈ స్టేషన్ భారత సరిహద్దు ముగిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమయ్యే ప్రదేశంలో ఉంటుంది. అయితే ఈ సింఘాబాద్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉంది. బ్రిటిష్ వారి కాలంలో ఈ సింఘాబాద్ రైల్వే స్టేషన్‌ను స్థాపించారు. ఇది ఎంతో చారిత్రకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఇది కోల్‌కతా, ఢాకా మధ్య రవాణా సంబంధంలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యానికి ముందు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖ వ్యక్తులు ఢాకాకు వెళ్లడానికి ఈ స్టేషన్ ద్వారా వెళ్లేవారట. అయితే ఇప్పుడు ఈ స్టేషన్ చాలా సైలెంట్ అయిపోయింది. ఇక్కడ ఎలాంటి పాసింజర్ రైళ్లు కూడా ఆగవు. ప్రత్యేకంగా కేటాయించిన కొన్ని గూడ్స్ రైళ్లు వెళ్తాయి. అవి కూడా బంగ్లాదేశ్ వెళ్లేవి అయితే వెళ్తుంటాయి. అయితే ఈ రైల్వే స్టేషన్ బ్రిటిష్ వారు విడిచిపెట్టనప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. బంగ్లాదేశ్‌కి 1971లో స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత ఈ సింఘాబాద్ రైల్వే స్టేషన్ బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారమ్‌లను మూసి వేశారు. మొత్తం ఖాళీగా ఉంది. ఈ స్టేషన్‌లో ఎవరూ కూడా ఉండరు. మొత్తం ఖాళీగానే ఈ రైల్వే స్టేషన్ ఉంటుది. అయితే ఈ రైల్వే స్టేషన్‌ను చూడటానికి కొందరు వెళ్తుంటారు. ఈ స్టే్షన్‌ను బాగా అభివృద్ధి చేశారు. చూడటానికి ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ స్టేషన్‌ను అందరూ కూడా వీక్షించవచ్చు.
Read Also: అదృష్టమంటే వీరిదే భయ్యా.. ఈ రాశుల వారికి అసలు తిరుగే లేదు
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.