Bhauma Pradosha Vratam: శివుడు ఆశీస్సులు పొందాలంటే.. నేడు భౌమ ప్రదోష వ్రతం ఆచరించాల్సిందే

Bhauma Pradosha Vratam:
హిందూ శాస్త్రంలో మహా శివరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మహా శివరాత్రి నాడు శివుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే కేవలం శివరాత్రి రోజే కాకుండా అన్ని రోజులు కూడా శివుడిని భక్తితో పూజిస్తారు. ఈ క్రమంలో నేడు కొందరు భౌమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని కష్టాలు తీరిపోతాయి. ప్రదోష వ్రతం అంటే శివుడిని భక్తితో పూజిస్తారు. నేడు ఈ పూజను భక్తితో ఆచరించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు కూడా తొలగిపోతాయి. తొలగిపోయి, జీవితంలో సుఖ సమృద్ధి వస్తుందని నమ్ముతారు. అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. అయితే ఈ ప్రదోష వ్రతాన్ని ప్రతీ నెల శుక్ల, కృష్ణ పక్షం త్రయోదశి తిథి రోజున నిర్వహిస్తారు. త్రయోదశి నాడు ఈ వ్రతం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే నేడు మంగళవారం ఈ తిథి రావడంతో దీన్ని భౌమ ప్రదోష వ్రతం అంటారు. మంగళవారం నాడు ఈ ప్రదోష వ్రతం చేయడం వల్ల అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతారు. అలాగే దోషాలు అన్ని కూడా తొలగిపోయి.. ఆరోగ్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ భౌమ ప్రదోష వ్రతం ఆచరిస్తే.. శివుడి ఆశీస్సులు తప్పకుండా అందుతాయని పండితులు అంటున్నారు. ఈ తిధి నేడు మధ్యాహ్నం 12:57 నిమిషాల నుంచి తర్వాత రోజు ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 11:08 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో వ్రతం ఆచరిస్తే ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరాలంటే మాత్రం సాయంత్రం 6:18 గంటల నుంచి రాత్రి 8:49 గంటల సమయంలో పూజ చేయాలి. ఈ వ్రతాన్ని చాలా భక్తితో ఆచరించాలి. ఉదయాన్నే స్నానం ఆచరించి.. కొత్త దుస్తులు ధరించాలి. శివాలయానికి వెళ్లి జలార్పణ చేయాలి. అలాగే దీప, ధూప నైవేద్యాలు పెట్టాలి. పువ్వులు, బిల్వ పత్రాలు, పండ్లు వంటి వాటితో శివుడిని పూజించాలి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే నేడు శివుడిని పూజించడంతో పాటు హనుమంతుని కూడా పూజించాలి. ఇలా పూజను ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి నేడు శివుడిని భక్తితో పూజించండి. మీరు కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి.