Dream : కలలో విమానం కనిపించిందా ? త్వరలోనే మీరు ఊహించని అదృష్టం పడుతుందట

Dream : కలలు అనేవి మన జీవితంలో ఒక భాగం. మనం పడుకున్నప్పుడు కొన్నిసార్లు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని కలలు మనకు భవిష్యత్తు గురించి కొన్ని సంకేతాలను ఇస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కలలో విమానం కనిపించడం వెనుక చాలా అర్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి విమానం కలలో ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? శుభమా, అశుభమా? అనేది వివరంగా తెలుసుకుందాం.
నిద్రపోతున్నప్పుడు మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లు కల వస్తే అది చాలా శుభ సంకేతం. మీరు చాలా కాలంగా చూస్తున్న ఒక కల త్వరలోనే నిజం కావచ్చని దీని అర్థం. అలాగే, మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారని, అది మీ జీవితంలో ఒక మంచి మలుపు అవుతుందని ఇది సూచిస్తుంది.
Read Also:BSNL 5G : భాగ్యనగరంలో BSNL 5G సేవలు ప్రారంభం.. వినియోగదారుల నిరీక్షణకు తెర!
రన్‌వేపై విమానం కనిపించడం లేదా టేకాఫ్ అవ్వడం లాగా కల వస్తే మీరు చాలా రోజులుగా చేస్తున్న ఒక పని త్వరలోనే పూర్తవుతుందని అర్థం. విమానాశ్రయం నుండి విమానం ఎగురుతూ కనిపించడం కూడా మంచి సంకేతమే. ఇది మీ వ్యాపారం లేదా పని విస్తరిస్తుందని భవిష్యత్తులో మీకు విజయం లభిస్తుందని సూచిస్తుంది.
చాలా విమానాలను కలలో కనుక కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా బలపడతారని అర్థం. అంటే, మీరు త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉందని ఈ కల సూచిస్తుంది. ఇది ధన లాభానికి సంకేతంగా కలల శాస్త్రం చెబుతుంది. మీరు కలలో చాలా పెద్ద విమానాన్ని చూస్తే, మీరు ఊహించని విధంగా మీ కోరికలలో ఒకటి త్వరలోనే నెరవేరనుందని అర్థం చేసుకోవాలి. ఇది గొప్ప విజయానికి సూచనగా చెబుతున్నారు.
Read Also:Vi : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. నెట్వర్క్ లేకపోయినా ఆడియో-వీడియో కాల్స్!
విమాన ప్రమాదం కనిపించడం – అశుభ సంకేతం!
మీరు కలలో విమానం ప్రమాదానికి గురైనట్లు చూస్తే అది అశుభ సంకేతంగా పరిగణించాలి. దీని అర్థం మీరు పూర్తి ప్రయత్నంతో చేస్తున్న పనికి అడ్డంకులు రావచ్చని. ఇది మీ ఆరోగ్యం క్షీణించవచ్చని కూడా సూచిస్తుంది. కాబట్టి, ఇలాంటి కల వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని స్వప్న శాస్త్రం చెబుతుంది.