Dreams : ఇలాంటి కలలు వస్తున్నాయా.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే
Dreams : ముఖ్యంగా ఏదైనా ఎత్తయిన ప్రదేశం, కొండ మీద నుంచి పడిపోతున్నట్లు కలలు వస్తాయి. లేదా మంచ మీద నుంచి కిందకి జారిపోవడం, పెద్ద ఇంటి నుంచి కిందకి పడిపోతున్నట్లు కలలు వస్తుంటాయి. అయితే ఇలాంటి కలల వస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఇది మంచిదా? కాదా? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Dreams : ప్రతీ మనిషికి ఏదో ఒక సమయంలో కలల రావడం అనేది సహజం. కొని కలల హ్యాపీగా అనిపిస్తే మరికొన్ని కలల బాధను ఇస్తాయి. అయితే మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అవే కలల వస్తాయని కొందరు అంటుంటారు. మరికొందరు వచ్చిన కలల మన జీవితంలో జరుగుతాయని అంటారు. అయితే ఈ కల వచ్చి వెంటనే కొందరు భయంతో నిద్రలేస్తారు. మళ్లీ వాళ్లకి నిద్ర కూడా పట్టదు. ఆ కలతో చాలా భయాందోళనకు గురవుతారు. కొన్ని కలల సాధారణంగా ఉంటాయి. ఇవి పెద్దగా ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. కానీ కొన్ని కలల మాత్రం లైఫ్కి చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. కొందరికి కొన్ని వింత రకమైన కలల వస్తుంటాయి. ముఖ్యంగా ఏదైనా ఎత్తయిన ప్రదేశం, కొండ మీద నుంచి పడిపోతున్నట్లు కలలు వస్తాయి. లేదా మంచ మీద నుంచి కిందకి జారిపోవడం, పెద్ద ఇంటి నుంచి కిందకి పడిపోతున్నట్లు కలలు వస్తుంటాయి. అయితే ఇలాంటి కలల వస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఇది మంచిదా? కాదా? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఎత్తయిన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు ఏవైనా కలలు వస్తున్నట్లయితే అవి కొన్నింటికి కారణమట. వీటిని ఎక్కువగా పీడకలల అని అంటారు. ఎందుకంటే ఈ కల వస్తే నిద్రకు సంబంధించిన సమస్యలు ఉండటం, ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. బాగ ఎత్తు లేదా కొండ పై నుంచి మీరు పడిపోతున్నట్లు కలల వస్తే మాత్రం మీకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం చేసుకోవాలి. మీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతేనే ఇలా కొండ మీద నుంచి పడుతున్నట్లు కల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి ఏదైనా పారాచూట్ నుంచి పడుతున్నట్లు కల వస్తుంది. ఇది అయితే కాస్త మంచి కల అని నిపుణులు అంటున్నారు. ఇలా పడుతున్నట్లయితే ఇది మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని తెలియజేయడానికి సంకేతం. ఇలా ఒక్కో సందర్భాన్ని బట్టి కలలు వస్తుంటాయి. దాని బట్టి ఆ కల అర్థం చెబుతుంటారు.
ఎక్కువగా ఆందోళన చెందడం, కొన్ని విషయాల గురించి భయపడటం వల్ల ఇలాంటి పీడ కలల వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఒత్తిడికి గురైతే మాత్రం తప్పకుండా ఇలాంటి కలలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి కలల బారిన పడకూడదంటే ఆందోళనకు గురి కాకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఒకే విషయం గురించి ఆలోచించవద్దు. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే మాత్రం యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కలలు అనేవి సాధారణంగా వస్తాయి. ఎలాంటి కలలు రావాలనేది మాత్రం మీరు ఆలోచించే తీరులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువగా అనవసర విషయాల గురించి ఆలోచించవద్దని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Getting Good Job: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే