Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి నాడు.. ఇలా పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం
ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు మొదటిగా వినాయకుడిని పూజిస్తారు. గణపతిని పూజించడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా తలచిన కార్యం అవుతుందని నమ్ముతారు.

Sankatahara Chaturthi: ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు మొదటిగా వినాయకుడిని పూజిస్తారు. గణపతిని పూజించడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా తలచిన కార్యం అవుతుందని నమ్ముతారు. అందుకే అన్ని పండుగల కంటే ముందుగా వినాయక చవితిని జరుపుకుంటారు. ఆ తర్వాతే ఏ పండుగను అయినా కూడా జరుపుకుంటారు. అయితే వినాయకుడిని ఎక్కువగా బుధవారం పూజిస్తారు. ఎలాంటి అభిషేకాలు వంటివి ఉన్నా కూడా బుధవారం చేయిస్తారు. అయితే వినాయకుడిని సంకటహర చతుర్థి నాడు కూడా ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే ఏప్రిల్ 16వ తేదీ బుధవారం నాడు సంకటహర చతుర్థిని జరుపుకుంటారు. ఈ రోజును వినాయకుడిని ఎలా పూజిస్తే మంచి జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్గా ప్రియాంక?
సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఆచరించి వినాయకుడిని పూజిస్తే సమస్యలన్ని కూడా తీరిపోతాయి. ముఖ్యంగా రుణ బాధలు ఎక్కువగా తీరిపోతాయి. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి సంపద వృద్ధి చెందుతుంది. అయితే చైత్ర కృష్ణపక్ష చతుర్థి అనేది బుధవారం ఏప్రిల్ 16న 1:15 గంటలకు మొదలై ఏప్రిల్ 17న 3:22 వరకు ఉంటుంది. ఈ సమయంలోనే వినాయకుడిని పూజించి ఉపవాసం ఆచరించాలి. అయితే కొందరు ఈ సంకటహర చతుర్థిని ఏప్రిల్ 17వ తేదీన జరుపుకుంటారు. అయితే ఈ సంకటహర చతుర్థి నాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి చేయాలి. ఆ తర్వాత భక్తితో వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి ఇష్టమైన బెల్లం వంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి. వీటితో పాటు పండ్లు, కొబ్బరి కాయలు వంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి. ఇలా పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే మాత్రం తప్పకుండా కష్టాలన్ని కూడా తొలగిపోతాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా క్లియర్ అవుతాయి. ఇలా భక్తితో పూజించి వినాయకుని స్తోత్రాలు కూడా చదవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు కూడా రావు.
Read Also: మైత్రి మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపిన ఇళయరాజా
సంకటహర చతుర్ధి నాడు వినాయకుడిని భక్తితో పూజించిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయాలి. అప్పుడు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. అయితే పేదలకు అన్నం, దుస్తులు వంటివి దానం చేయాలి. వీటితో పాటు పప్పులు, గోధుమలు, ధాన్యం వంటి వాటిని కూడా దానం చేయవచ్చు. అలాగే సీట్లు, పండ్లు, నైవేద్యంగా పెట్టిన వాటిని పేదలకు పంచాలి. ఆవులు, కుక్కలు ఇలా జంతువులకి ఆహారం పెట్టాలి. వీటితో పాటు నీరు దానం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, గొడుగు వంటి వాటిని దానం చేయడం వంటివి కూడా చేయాలి. ఇలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు అయినా కూడా క్లియర్ అయిపోతాయి. దీర్ఘకాలికంగా బాధపడుతున్న సమస్యలు అన్నింటి నుంచి కూడా విముక్తి పొందుతారు.
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
-
Easter: ఈస్టర్లో కలర్‌ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Vastu Tips: ఇంట్లో పగిలిన అద్దం ఉంటే.. ఎంత అరిష్టమో మీకు తెలుసా?
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే