Champions Trophy 2025: ఇమ్రాన్ వల్లే పాకిస్థాన్ క్రికెట్ పతనమైందా? ఇందులో నిజమెంత?

Champions Trophy 2025:
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో పాక్ ఘోర పరాభవానికి ఎదురైన విషయం తెలిసిందే. కనీసం సెమీస్ వరకు కూడా చెరలేకపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం ఈ జట్టుపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్ సేథి కూడా పాక్ ఓటమిపై స్పందించాడు. ఈ క్రమంలో పాక్‌కు వన్డే వరల్డ్‌కప్ ఇచ్చిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు చేశారు. ఇతని వల్లే పాకిస్థాన్ క్రికెట్ పూర్తిగా పతనమైందని విమర్శలు గుప్పించాడు.
పాకిస్థాన్ జట్టు చేసిన ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం తప్పు కాదన్నారు. పాక్ క్రికెట్ పూర్తిగా పతనమైందన్నారు. ఒకప్పుడు పాకిస్థాన్ ప్రపంచంలోని నెంబర్ వన్ జట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా పతనమైందన్నారు. 1990, 1996లో వన్డేల్లో అగ్రస్థానం, టీ 20 ల్లో స్థానం సాధించిందన్నారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ జట్టు పతనం 2019 నుంచి ప్రారంభమైందని అన్నారు. దీనికి ముఖ్య కారణం మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. ఇతని ఆధ్వర్యంలో కొత్త మేనేజ్‌మెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటివల్లే పాకిస్థాన్ క్రికెట్ పూర్తిగా నాశనం అయ్యిందన్నారు. దశాబ్దాల నుంచి అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్లును నిర్లక్ష్యం చేశారని, అసలు సెట్ కాని హైబ్రిడ్ మోడల్‌ను తీసుకొచ్చారన్నారు. వీటివల్లే పాకిస్థాన్ విధి విధానాలు అన్ని కూడా దారి తప్పాయి. దేశీయంగా కాకుండా విదేశీ కోచ్‌లను ఎంపిక చేయడం, వారికి ఇష్టమైన వారిని సెలక్ట్ చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయన్నారు. అలాగే జట్టులోని సహచరులతో కెప్టెన్‌కు సరిగ్గా పడకపోవడం, వేర్వేరు గ్రూప్‌లు తయారు కావడం వంటి కారణాలు కూడా పాకిస్థాన్ క్రికెట్‌ను నాశనం చేశాయి. అప్పుడే మేనేజ్‌మెంట్ సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణల కేసు విషయంలో జైలులో ఉన్నారు. అయితే పాకిస్థాన్ జట్టు ఓడిపోవడంతో అతను తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. మొదటి రెండు మ్యాచ్‌లలో పాకిస్థాన్ ఓడిపోవడంతో ట్రోఫీ నుంచి ఔట్ అయ్యింది. ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. ఈ ట్రోఫీలో పాకిస్థాన్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఆ తర్వాత భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడగా ఇందులో కూడా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ గెలిచి ఉంటే పాకిస్థాన్‌కు సెమీస్ ఆశలు ఉండేవి. కానీ బంగ్లాదేశ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు అన్ని కూడా ఆవిరి అయిపోయాయి.
-
IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
-
Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, రిషబ్ కాదు.. ఎవరంటే?
-
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మట్టిలో కలిసిపోవడం గ్యారెంటీ!
-
Gautam Gambhir: విరాట్, రోహిత్ ఔట్.. ఇక గౌతమ్ గంభీర్ హవానే!
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?