Champions Trophy 2025: ఆస్ట్రేలియాపై సెమీస్‌లో టీమిండియా రివేంజ్.. ఫైనల్‌కి భారత్

Champions Trophy 2025:
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌లో ఆసీస్‌ను భారత్ చిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆలౌటైంది. 265 పరుగులతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సిక్సర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇండియా గెలవడంలో విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. ఐదోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరింది.
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ కంగారుల చేతిలో ఓడిపోయింది. దీనికి ప్రతీకారంగా భారత్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియను చిత్తుగా ఓడించింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ పడతాదని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 34, హర్దిక్ పాండ్య 28, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభమన్ గిల్ 8 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు ఆడమ్ జంపా 2 వికెట్లు తీశాడు. బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లి్ష్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ తీశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9వ తేదీన దుబాయ్‌లో జరగనుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడే జట్టు ఏదో ఇంకా ఫిక్స్ కాలేదు. బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జరిగే సెమీ ఫైనల్-2 జరగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఫైనల్‌లో భారత్ తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ప్రతీ మ్యాచ్ గెలుస్తూ.. ఫైనల్‌కి ఎంట్రీ అయ్యింది.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ మరో రికార్డును ఛేజ్ చేశాడు. అంతర్జాతీయ వన్డే ఛేజింగ్‌లో 8000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో సచిన్ టెండూల్కర్ 8720 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ