Champions Trophy: నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్.. గెలుపు ఎవరిది?
Champions Trophy:

Champions Trophy: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీ దుబాయ్‌లో హైబ్రిడ్ మోడల్‌లో కూడా జరగనుంది. ఎందుకంటే టీమిండియా పాకిస్థాన్ వెళ్లదు. దీంతో టీమిండియాతో జరిగే మ్యాచ్‌లన్నీ కూడా హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్ (Dubai) వేదికగానే జరగనున్నాయి. భద్రతా కారణాల వల్ల టీమిండియా (Team India) పాకిస్థాన్ వెళ్లడం లేదు. బీసీసీఐ కూడా టీమిండియా జట్టును పాక్‌కు పంపించేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఐసీసీ కూడా హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ మొదటి మ్యాచ్ రేపు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా జట్టు రేపు దుబాయ్ (Dubai) వేదికగా తలపడనుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అందరి చూపు కూడా భారత్, పాక్ మ్యాచ్ పైనే ఉంది. ఈ రెండు జట్లకు ఎప్పుడు మ్యాచ్ జరగనుందో అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే పాకిస్థాన్‌తో భారత్ ఫిబ్రవరి 23న తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కేవలం ఇండియానే కాకుండా పాకిస్థాన్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంది.
టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో ఆడే మ్యాచ్‌లు అన్ని కూడా దుబాయ్‌లో జరగనున్నాయి. భారత్ బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిల్యాండ్‌తో వరుసగా ఆడనుంది. ఈ మూడు మ్యాచ్లలో రెండు అయినా టీమిండియా గెలిస్తే.. సెమీస్‌కు వెళ్తుంది. మార్చి 4వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే గ్రూప్-బీలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక జట్టు సెమీస్‌కి వెళ్తుంది. ఇలా రెండు జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. అయితే టీమిండియా ఆన్ని మ్యాచ్‌లు కూడా దుబాయ్ వేదికగానే హైబ్రిడ్ మోడల్‌లోనే జరగనున్నాయి. అయితే టీమిండియా సెమీస్‌కు క్వాలిఫై కాకపోతే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు అన్ని కూడా పాక్ వేదికగానే జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలో చూడవచ్చు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మిగతా అన్ని మ్యాచ్‌ల కంటే పాకిస్థాన్, భారత్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్ ఎంత హోరాహోరీగా ఉండనుంది. ఎవరి గెలుస్తారో చూడాలి.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ