ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!

ICC : వన్డే క్రికెట్లో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో బ్యాటర్ల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు మార్పులు చేస్తోంది. వన్డేల్లో రెండు కొత్త బంతుల పద్ధతి గత పదేళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ పద్ధతిని ఐసీసీ ఇక పక్కన పెట్టడానికి చూస్తోంది. కేవలం ఒక బంతితోనే వన్డే క్రికెట్‌ను ఆడించాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీకి ఓ ప్రతిపాదన చేసింది. అయితే జింబాబ్వేలో ఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్డేల్లో ఒకే బంతిని మాత్రమే వాడటానికి ఐసీసీ ప్రతిపాదిస్తోంది. పదేళ్ల క్రితం ఇదే అమల్లో ఉండేది. ఈ బంతి పాత అయిపోయిన తర్వాత రివర్స్ స్వింగ్‌కు వాడే అవకాశముండేది. అయితే ఈ బంతి వల్ల స్పిన్నర్లకు కూడా పట్టు ఉంటుంది. దీంతో బాగా స్పిన్ చేసేవారు. అయితే కొన్ని సందర్భాల్లో కొత్త బంతిని ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత గరిష్టంగా 25 ఓవర్లు వరకు మాత్రమే వినియోగంలో ఉండేది. దీంతో రివర్స్ స్వింగ్ తర్వాత సాధ్యపడేది కాదు. దీనివల్ల బంతి తిప్పడం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలోనే సాధ్యపడట్లేదు. బంతిని తిప్పడమూ కష్టమవుతోంది. బౌలర్లకు రోజురోజుకి పరిస్థితులు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే గంగూలీ టీం రెండు బంతులు నిబంధనను తీసేయాలని ప్రతిపాదించింది. వీటిన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని గంగూలీ కమిటీ ఒకే బంతిని ఇకపై వన్డేల్లో ఆడించాలని భావిస్తోంది.
వన్డే క్రికెట్లో ఒకే బంతి ప్రతిపాదనతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా మార్పులు చేయాలని కమిటీ సూచించింది. ఎక్కువ తేడాతో కొన్ని జట్లు గెలుస్తాయి. అయితే ఈ పెద్ద ర్యాంకు జట్ల మీద చిన్న జట్లు గెలిస్తే అదనపు పాయింట్లు ఇవ్వాలని గంగూలీ టీమ్ ఐసీసీకి సూచించింది. వీటిని పరిశీలించాలని తెలిపింది. అయితే పెద్ద, చిన్న జట్లను వేర్వేరుగా జోన్లలో ఉంచి టెస్టులు ఆడించాలనే ప్రతిపాదన విషయంలో మాత్రం ఐసీసీ ఒప్పుకోవడానికి రెడీగా లేదు. అయితే అండర్-19 ప్రపంచకప్‌ను కూడా ఇకపై వన్డేల్లో కాకుండా టీ20ల్లో నిర్వహించాలని భావిస్తోంది. ఎందుకంటే టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ సమస్య బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఓవర్‌కు, ఓవర్‌కు మధ్య విరామం పెరగకుండా ఉండేందుకు స్టాప్ వాచ్ వాడాలని భావిస్తోంది. మరి వీటిపై ఐసీసీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ
-
Rishabh Pant: రూ.27 కోట్లు వేస్ట్.. పంత్‌ను ఏకిపారేస్తున్నా గోయెంకా