IND vs BANG: గిల్ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై టీమిండియా విక్టరీ.. చాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం

IND vs BANG: ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) బంగ్లాదేశ్‌పై భారత్ విక్టరీ సాధించింది. శుభారంభంలోనే భారత్ (India) ఘన విజయం సాధించింది. నేడు దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టిమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ 228 పరుగులకే అలౌట్ కాగా.. భారత్ 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (41), శుభ్‌మన్ గిల్ నాటౌట్‌గా (101) స్కోర్ చేశాడు. రోహిత్ (Rohith Sharma) ఫామ్‌లో లేడని అన్న వాళ్లందరూ షాక్ అయ్యేలా ఫామ్‌లోకి వచ్చాడు. 36 బంతుల్లోనే 41 పరుగులు చేయగా.. అందులో ఏడు ఫోర్లు కొట్టాడు. హిట్ మ్యాన్ పక్కాగా హాఫ్ సెంచరీ చేస్తాడనుకునేలోగా.. తస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు. లేకపోతే హిట్ మ్యాన్ ఖాతాలో మరో ఆఫ్ సెంచరీ చేరేది. రోహిత్ ఔట్ అయిన తర్వాత కోహ్లి (22), శుభ్‌మన్ (Subhman Gill) కలిసి ఆడారు. అయితే కోహ్లీ (Virat Kohli) చాలా జాగ్రత్తగా ఆడినా కూడా క్యాచ్ ఇచ్చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) కూడా ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా బ్యాటర్లు కాస్త జాగ్రత్తగానే ఆడారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(41) వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో 46.3 ఓవర్లలోనే టీమిండియా లక్ష్య ఛేదనను సాధించింది.
వికెట్లు వరుసగా పడుతుంటే గిల్‌కి ఓ వైపు టెన్షన్ మొదలవుతుంది. కానీ తను ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా.. ఆడాడు. చక్కటి షాట్లతో సెంచరీ చేసి టీమిండియాను గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. గిల్‌కు కేఎల్ రాహుల్ (41 నాటౌట్) కూడా బాగా సహకరించాడు. అయితే కేఎల్ రాహుల్ ఫైనల్‌గా సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు. అయితే కేవలం బ్యాటర్లు మాత్రమే కాకుండా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ అవుతున్నప్పుడు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. భారత సీనియర్ పేసర్ షమీ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. హర్షిత్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి టీమిండియాను గెలవడంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే అక్షర్ పటేల్ హ్యాట్రిక్‌ను రోహిత్ శర్మ మిస్ చేశాడు. లేకపోతే అంతర్జాతీయ టోర్నీలో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ చేరేది. ఏది ఏమైనా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేయబోతుందో చూడాలి.
-
Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే
-
Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్