IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ
IPL 2025 : ప్రతీసారి వేలంలో సన్‌రైజర్స్ జట్టు ఎందరో ప్లేయర్లను తీసుకొచ్చింది. వీరిలో ఎందరో కుర్ర ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించారు. వారిలో అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. వీరిందరూ కూడా ఐపీఎల్ జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడిన ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం నట్టింట ముంచేశాడు. ఆ ప్లేయర్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని జట్లు మీద పోలిస్తే ఈ జట్టుకు అత్యంత నిలకడమైన జట్టుగా కూడా పేరు ఉంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ 2018లో ఫైనల్ వరకు వెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి జట్టు లైనప్ తగ్గిపోయింది. అప్పుడు జట్టులో కూడా చాలా మార్పులు వచ్చాయి. గతేడాది కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ వరకు వెళ్లి ఛాంపియన్స్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ప్రతీసారి వేలంలో సన్‌రైజర్స్ జట్టు ఎందరో ప్లేయర్లను తీసుకొచ్చింది. వీరిలో ఎందరో కుర్ర ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించారు. వారిలో అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. వీరిందరూ కూడా ఐపీఎల్ జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడిన ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం నట్టింట ముంచేశాడు. ఆ ప్లేయర్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కేవలం ఒకే ఒక్క ప్లేయర్ నట్టింట ముంచేశాడు. జమ్మూకి చెందిన అబ్దుల్ సమద్‌ను సన్‌రైజర్స్ జట్టు 2020లో వేలంలో రూ.20 లక్షలకు రిటైయిన్ చేసుకుంది. అయితే ఆ సీజన్లో అబ్దుల్ సమద్ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మొత్తం 12 మ్యాచ్‌లలో అబ్దుల్ సమద్ కేవలం 111 పరుగులు మాత్రమే చేశాడు. అయినా కూడా తర్వాత సీజన్లో తనని వదిలేయకుండా సన్‌రైజర్స్ జట్టు మళ్లీ 2021లో తీసుకుంది. ఈ సీజన్లో కూడా అబ్దుల్ సమద్ మళ్లీ కూడా తక్కువ పరుగులు మాత్రమే చేశాడు. ఆటలో అద్భుతమైన ప్రదర్శన చేయకపోయినా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అబ్దుల్ సమద్‌ను వదల్లేదు. చివరకు అభిషేక్ శర్మను వదిలేసింది. కానీ అబ్దుల్ సమద్‌ను వదలకుండా మళ్లీ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. అయినా కూడా ఆటలో అద్భుతంగా అయితే కనిపించలేదు.
అబ్దుల్ సమద్ 2023లో మొత్తం 9 మ్యాచ్‌ల్లో 139 పరుగులు చేయగా.. 2024లో 182 పరుగులు మాత్రమే చేశాడు. అన్ని మ్యాచ్‌లలో కలిపి ఇన్ని తక్కువ పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విసిగిపోయింది. దీంతో ఈ సీజన్ వేలంలో అబ్దుల్‌ను వదిలేసింది. దీంతో ఈ సారి వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అబ్దుల్ సమద్‌ను రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో అబ్దుల్ సమద్ ఆడలేదు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమద్ చెలరేగిపోయాడు. ఇటీవల పంజాబ్‌పై కూడా చెలరేగి ఆడాడు. సన్‌రైజర్స్ జట్టులో ఉన్నప్పుడు అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 22 పరుగులు చేయగా.. పంజాబ్‌పై 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కేవలం రెండు మ్యాచ్‌లలో ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గతంలో సన్‌రైజర్స్ తరఫున ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రదర్శన ఒక్కసారి కూడా చేయలేదు.
-
Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే
-
Maran Brothers : SRH పని ఖతమే.. కావ్యమారన్ కు మూడినట్టే.. సన్ సంస్థకు బ్రదర్స్ స్ట్రోక్