Maran Brothers : SRH పని ఖతమే.. కావ్యమారన్ కు మూడినట్టే.. సన్ సంస్థకు బ్రదర్స్ స్ట్రోక్

Maran Brothers : తమిళనాడులో ఇప్పుడు ఒక కొత్త విషయం పెద్ద చర్చకు దారితీసింది. అక్కడి రాజకీయాల్లో, వ్యాపార రంగంలో చాలా పవర్ఫుల్ అయిన మారన్ బ్రదర్స్ మధ్య గొడవ మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఈ గొడవ ఇప్పుడు తమిళనాడులోని బిజినెస్, పొలిటికల్ సర్కిల్స్ పెద్ద దుమారం రేపుతోంది. అసలు ఈ గొడవ అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి తలనొప్పిగా మారుతుందా? అనేదే ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం. అంతేకాదు, ఈ గొడవ మరింత ముదిరితే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ యజమాని కావ్య మారన్ గారికి కూడా ఇబ్బందులు రావొచ్చట. ఇంతకీ అసలు ఈ గొడవ ఏంటి? ఈ వార్తలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కళానిధి మారన్, దయానిధి మారన్.. వీళ్లిద్దరూ మారన్ బ్రదర్స్. తమిళనాడు రాజకీయాల్లో, మీడియా రంగంలో వీళ్లకు మంచి పట్టుంది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి వీళ్లు దగ్గరి బంధువులు.
Read Also:Pawan Kalyan leaves Cabinet Meeting: క్యాబినెట్ భేటీ నుంచి పవన్ బయటకు.. హుటాహుటిన హైదరాబాద్ కు!
కళానిధి మారన్ సన్ నెట్వర్క్ (Sun Network) అధినేత. సన్ టీవీ, సన్ డైరెక్ట్, ఇంకా చాలా మీడియా కంపెనీలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీమ్ వీళ్లదే. ఈయన కూతురే కావ్య మారన్. దయానిధి మారన్ కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. వీరిద్దరి మధ్య గతంలో కూడా కొన్ని సార్లు గొడవలు వచ్చాయి. కానీ అవి సర్దుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఎందుకు గొడవ మొదలైందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే, ఇది ప్రధానంగా వ్యాపార విషయాలకు సంబంధించిందే అని కొందరు అంటున్నారు. వీరికున్న మీడియా వ్యాపారాలు, ఇతర పెట్టుబడుల విషయంలోనే విభేదాలు తలెత్తాయని చెబుతున్నారు.
ఈ మారన్ అన్నదమ్ముల గొడవ డీఎంకే పార్టీకి తలనొప్పిగా మారనుంది. డీఎంకే అనేది కరుణానిధి కుటుంబం చుట్టూ తిరిగే పార్టీ. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తే అది పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుంది. మారన్ కుటుంబానికి తమిళనాడు వ్యాపార రంగంలో మంచి పట్టుంది. వీరి గొడవ వల్ల పార్టీకి పారిశ్రామిక వర్గాల నుంచి అందే సపోర్టు మీద ప్రభావం పడొచ్చు. ఈ గొడవను ప్రతిపక్షాలు డీఎంకేను ఇరుకున పెట్టడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Read Also:Katrina Kaif: హాట్ అందాలతో యోగాసనాలు వేస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. కుర్రాలు చూస్తే ఫిదా!
ఇక, కావ్య మారన్ విషయానికి వస్తే, ఆమె సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి యజమానిగా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్. ఒకవేళ మారన్ బ్రదర్స్ మధ్య గొడవలు తీవ్రమైతే, అది సన్ నెట్వర్క్ వ్యాపారాలపై, ఆస్తులపై ప్రభావం చూపొచ్చు. అప్పుడు పరోక్షంగా కావ్య మారన్‌కు కూడా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇది కేవలం ఊహలు మాత్రమే.. రానురాను వీరిద్దరి మధ్య గొడవ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.